India Covid-19 Updates: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఇటీవల కాలంలో ప్రతిరోజూ వేయికి దిగువగానే కేసుల సంఖ్య నమోదవుతోంది. ఈ క్రమంలో కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. డిచిన 24 గంటల్లో శుక్రవారం దేశవ్యాప్తంగా 1,150 కరోనా కేసులు ( Coronavirus ) నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 83 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల్లో కేరళలోనే 75 మరణాలు నమోదయ్యాయి. గత హెచ్చుతగ్గులకు సంబంధించి కేరళ గణాంకాలను సవరిస్తుండటం దీనికి కారణమని అధికారులు తెలిపారు. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం 11,365 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,30,34,217 కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,21,656 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 1194 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,25,01,196 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.76 శాతం ఉంది.
ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,85.55 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా నిన్న 4,66,362 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వాటితో కలిపి ఇప్పటివరకు దేశంలో 79.34 కోట్ల పరీక్షలు చేసినట్లు వైద్య శాఖ తెలిపింది.
COVID19 | 1,150 new cases in India today; Active caseload stands at 11,365 pic.twitter.com/2RCyTxOfoa
— ANI (@ANI) April 9, 2022
Also Read: