Covaxin: ”రాబోయే 10-12 రోజుల్లో చిన్నపిల్లలపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయిల్స్”: నీతి ఆయోగ్ సభ్యుడు

Covaxin trials in children: రాబోయే 10-12 రోజుల్లో 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న చిన్న పిల్లలపై కోవాగ్జిన్ టీకా రెండోదశ...

Covaxin: రాబోయే 10-12 రోజుల్లో చిన్నపిల్లలపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయిల్స్: నీతి ఆయోగ్ సభ్యుడు
Covaxin Recommended For Next Phase Of Trials For 2 18 Age Group

Updated on: May 18, 2021 | 8:52 PM

Covaxin trials in children: రాబోయే 10-12 రోజుల్లో 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న చిన్న పిల్లలపై కోవాగ్జిన్ టీకా రెండోదశ, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి భారత్ బయోటెక్ సిద్ధంగా ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ చెప్పారు. రెండు నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు వారిపై రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కోసం కోవాగ్జిన్‌ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదించిందని … రాబోయే రోజుల్లో ట్రయల్స్ ప్రారంభమవుతాయని పాల్ తాజాగా జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. మే 11న పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి కోవాగ్జిన్‌ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి పొందిన విషయం తెలిసిందే.

కాగా, ముందుగా ఫిబ్రవరిలో 5-18 ఏళ్లలోపు పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలనే ప్రతిపాదనతో భారత్ బయోటెక్ సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్‌ను సంప్రదించింది. అయితే ఆ ప్రతిపాదనను సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ తిరస్కరించింది. ముందుగా పెద్దలపై టీకా సమర్ధతకు సంబంధించిన డేటాను సమర్పించాలని సంస్థను కోరింది.

Also Read:

 ఏటీఎంలో డబ్బును ఇలా కూడా డ్రా చేయొచ్చా.. యువతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..

అద్భుతమైన పోస్టాఫీస్ స్కీ‌మ్.. ప్రతీ నెలా రూ. 5042 కడితే.. రూ. 7.25 లక్షలు పొందొచ్చు..