Corona Cases Update In India: దేశంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే.!

Corona Cases India: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,388 మందికి కరోనా పాజిటివ్‌‌గా..

Corona Cases Update In India: దేశంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే.!
India corona latest updates

Updated on: Mar 09, 2021 | 11:57 AM

Corona Cases India: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,388 మందికి కరోనా పాజిటివ్‌‌గా నిర్దారణ అయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనితో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,12,44,786కి చేరింది. నిన్న కొత్తగా 16,596 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక, ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 1,08,99,394 కోలుకున్నారు.

కాగా, గురువారం ఒక్కరోజే 77 మంది కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,57,930కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,87,462 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కాగా, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో మునపటి కంటే భారీగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజులో 8,744 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కేరళలో 1,412 కొత్త కేసులు బయటపడ్డాయి. దీనితో ఈ రెండు రాష్ట్రాలలోని ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!