Edible Oil Price in India: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాటినుంచి వంట నూనె ధరలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు రెండు నెలల నుంచి దాదాపు లీటర్ వంట నూనెపై రూ.75 మేర పెరిగాయి. ఈ క్రమంలో ప్రజలపై మరో భారం పడనుంది. ఏప్రిల్ 28 తర్వాత, వంటనూనె మరింత ప్రియం కానున్నట్లు (Cooking Oil) మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్‌లో వంటనూనె ధరలు ఇప్పటికే భగ్గుమంటున్నాయి.. త్వరలో ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. లీటర్ సోయా నూనె 250, సన్‌ఫ్లవర్ నూనె 300, పామాయిల్ 200 దాటే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. దీనికి కారణాలు లేకపోలేదు. తాజాగా ఇండోనేసియా (Indonesia) కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనె ఎగుమతులపై నిషేధం విధించింది. ఏప్రిల్ 28 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. దీంతో మన దేశంలో వంట నూనె ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అటు ఇప్పటికే అమెరికాపై ఇండోనేషియా నిషేధం ఎఫెక్ట్ పడింది. అమెరికా (America) లో సోయా నూనె ధర 84 డాలర్లకు చేరింది. నెమ్మదిగా అది భారత్‌పై కూడా పడుతుందనే ఆందోళన నెలకొంది.
కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఇప్పటికే సన్ ఫ్లవర్ ఆయిల్ సరఫరాపై ప్రభావం పడింది. ఉక్రెయిన్ యుద్ధం ఇందుకు కారణమైంది. ఇప్పుడు పామ్ ఆయిల్ సరఫరాపై కూడా ఎఫెక్ట్ పడబోతోంది. దీంతో దేశంలో వంట నూనె ధరలు భారీగా పెరనున్నాయి. ఇప్పటికే వంట నూనె ధరలు ఎక్కువగా ఉన్నాయని, ఇప్పుడు ఇండోనేసియా నిర్ణయం వల్ల ధరలు మరింత పెరగితే, సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.
కేంద్ర ప్రభుత్వం ఇండోనేసియాతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని కోరుతున్నారు. మళ్లీ ఎగమతులు ప్రారంభం అయ్యేలా చూడాలని సూచిస్తున్నారు నిపుణులు. దేశీయ మార్కెట్‌లో ధరలు పెరగడం, పామ్ ఆయిల్ సరఫరా కొరత వంటి అంశాల కారణంగానే, ఇండోనేసియా ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read: