టీవీ యాంకర్ ఇంట్లో పేలిన కుక్కర్.. తప్పిన పెను ప్రమాదం

| Edited By: Team Veegam

Feb 25, 2020 | 5:22 PM

తమిళ టీవీలో ‘సూపర్ హిట్స్’ అనే కార్యక్రమం ద్వారా ఫేమస్‌ అయిన మణిమేఘలై.. ఇంట్లో వంట మనిషి రాకపొవడంతో.. ఆమెనే వంట చేసింది. ఈ క్రమంలో కుక్కర్‌లో రైస్ పెట్టింది. అది విజిల్ రాకుండా కాసేపటికే పేలి..

టీవీ యాంకర్ ఇంట్లో పేలిన కుక్కర్.. తప్పిన పెను ప్రమాదం
Follow us on

ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో వరుస ప్రమాదాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల సూపర్ హీరో అజిత్‌ రోడ్డు ప్రమాదానికి గురవ్వగా, భారతీయుడు-2 సినిమా సెట్‌లో భారీ క్రేన్ కుప్పకూలి ముగ్గురు మరణించారు. ఇప్పుడు తాజాగా చెన్నైలో టీవీ యాంకర్ ఇంట్లో ప్రెజర్ కుక్కర్ పెలింది. అయితే ఆ సమయంలో కిచెన్‌లో ఎవరూ లేకపోవడంతో.. పెద్ద ప్రమాదమే తప్పింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమెనే తెలియజేసింది.

తమిళ టీవీలో ‘సూపర్ హిట్స్’ అనే కార్యక్రమం ద్వారా ఫేమస్‌ అయిన మణిమేఘలై.. ఇంట్లో వంట మనిషి రాకపొవడంతో.. ఆమెనే వంట చేసింది. ఈ క్రమంలో కుక్కర్‌లో రైస్ పెట్టింది. అది విజిల్ రాకుండా కాసేపటికే పేలి.. వంటగది అంతా చెల్లాచెదురు అయిపోయింది. అయితే ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని.. వీడియో తీసి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు ఈ దంపతులు.