Jaqueline: జాక్వెలిన్‌కు కొనసాగుతున్న సుకేశ్‌ వేధింపులు.. ఈడీ కష్టాల నుంచి విముక్తి కల్పిస్తానని వాట్సప్‌ చాట్‌

|

Dec 26, 2023 | 9:34 PM

ఈడీ కష్టాల నుంచి విముక్తి కల్పిస్తా.. కోర్టుకు నల్లడ్రెస్‌తో రా.. అంటూ నటి జాక్వెలిన్‌కు సుకేశ్‌ చంద్రశేఖర్‌ పంపిన వాట్సప్‌ సందేశం తీవ్ర కలకలం రేపుతోంది. బాలీవుడ్‌లో ఆమెను లేడీ సూపర్‌స్టార్‌ చేస్తానని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సుకేశ్‌ లెటర్లతో మానసిక వేదన అనుభవిస్తున్నానని. దీనికి చెక్‌ పెట్టాలని ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు జాక్వెలిన్‌.

Jaqueline: జాక్వెలిన్‌కు కొనసాగుతున్న సుకేశ్‌ వేధింపులు.. ఈడీ కష్టాల నుంచి విముక్తి కల్పిస్తానని వాట్సప్‌ చాట్‌
Sukesh Chandrashekhar Jacqueline Fernandez
Follow us on

కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ఢిల్లీ జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ సుఖేష్ చంద్రశేఖర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. జైలులో ఉండగానే సుకేష్ బాలీవుడ్ స్టార్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన పలు ముఖ్యమైన ఆధారాలు బయటపడ్డాయి. ఓ విదేశీ నంబర్ నుంచి వాట్సాప్‌లో డజన్ల కొద్దీ మెసేజ్‌లు పంపగా, వాటి చాట్‌లు వెలుగులోకి వచ్చాయి. ఈ మెసేజ్‌లన్నీ జూన్ 30న వాట్సాప్‌లో జాక్వెలిన్‌కు పంపినట్లు గుర్తించారు.

ఈడీ కష్టాల నుంచి విముక్తి కల్పిస్తా.. కోర్టుకు నల్లడ్రెస్‌తో రా.. అంటూ నటి జాక్వెలిన్‌కు సుకేశ్‌ చంద్రశేఖర్‌ పంపిన వాట్సప్‌ సందేశం తీవ్ర కలకలం రేపుతోంది. బాలీవుడ్‌లో ఆమెను లేడీ సూపర్‌స్టార్‌ చేస్తానని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సుకేశ్‌ లెటర్లతో మానసిక వేదన అనుభవిస్తున్నానని. దీనికి చెక్‌ పెట్టాలని ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు జాక్వెలిన్‌.

ఢిల్లీ జైల్లో ఉన్నప్పటికి కేటుగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ నుంచి బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌కు వేధింపులు కొనసాగుతున్నాయి. జైల్లో నుంచి జాక్వెలిన్‌కు సుకేశ్‌ పంపించిన వాట్సప్‌ సందేశాలు బయటపడ్డాయి. ఈడీ కష్టాల నుంచి జాక్వెలిన్‌కు విముక్తి కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. తన వాట్సప్‌ సందేశాలను చదవిన దానికి గుర్తుగా కోర్టుకు నల్ల డ్రెస్‌లో రావాలని సూచించినట్టు తెలుస్తోంది.

బాలీవుడ్‌లో జాక్వెలిన్‌ను సూపర్‌స్టార్‌ చేస్తానని సుకేశ్‌ హామీ ఇచ్చాడు. అంతేకాదు ఓ ప్రముఖ నిర్మాత త్వరలో ఆమెను కలుస్తాడని , భారీ బడ్జెట్‌ సినిమాలో అవకాశం ఇస్తాడని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో జైల్లో ఉన్నాడు సుకేశ్‌. అయితే లేఖల పేరుతో సుకేశ్‌ తనను వేధిస్తున్నాడని , లేఖల సందేశం మీడియాలో రావడంతో తాను తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్టు కోర్టులో పిటిషన్‌ వేశారు జాక్వెలిన్‌. జైలు నుంచి సుకేశ్‌ లెటర్లు రాయకుండా చూడాలని పిటిషన్‌లో ఆమె కోరారు.

అయితే తాను జాక్వెలిన్‌ను వేధించినట్టు లెటర్లలో ఒక్క పదం ఉన్నా ఏ శిక్షనైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నట్టు చెబుతున్నారు సుకేశ్‌ చంద్రశేఖర్‌. మనీలాండరింగ్‌ కేసులో సుకేశ్‌ తనను అక్రమంగా ఇరికించాడని , ఈ కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలని ఢిల్లీ కోర్టును కోరారు జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌. మరోవైపు జాక్వెలిన్‌ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించింది. సుకేశ్‌ చంద్రశేఖర్‌ నుంచి ఆమె విలువైన బహుమతులు అందుకున్నారని , శ్రీలంకలో ఉన్న జాక్వెలిన్‌ సోదరికి కూడా విలువైన గిఫ్ట్‌లను ఇచ్చాడని ఈడీ కౌంటర్‌ దాఖలు చేసింది. ఈ కేసుపై విచారణను ఢిల్లీ హైకోర్టు జనవరి 29వ తేదీకి వాయిదా వేసింది.

మరిన్న జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..