మోదీ ప్రభుత్వ విధానాలపై.. ‘భారత్ బచావ్‌’ ర్యాలీకి కాంగ్రెస్ పిలుపు

| Edited By:

Dec 14, 2019 | 8:14 AM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు-2019పై ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. బిల్లుకు వ్యతిరేకంగా అసోం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారత్ బచావ్‌ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఈ ర్యాలీ జరగనుండగా.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, పార్టీ అగ్రనేత రాహుల్ సహా ఇతర కీలక నేతలందరూ హాజరుకానున్నారు. బీజేపీ ప్రభుత్వ […]

మోదీ ప్రభుత్వ విధానాలపై.. భారత్ బచావ్‌ ర్యాలీకి కాంగ్రెస్ పిలుపు
Follow us on

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు-2019పై ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. బిల్లుకు వ్యతిరేకంగా అసోం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారత్ బచావ్‌ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఈ ర్యాలీ జరగనుండగా.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, పార్టీ అగ్రనేత రాహుల్ సహా ఇతర కీలక నేతలందరూ హాజరుకానున్నారు. బీజేపీ ప్రభుత్వ విభజనవాదం, విధ్వంసక వైఖరికి నిరసగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు ఈ ర్యాలీ నిర్వహించబోతున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

ఈ నేపథ్యంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ తదితరులు శుక్రవారం రాంలీలా మైదానాన్ని సందర్శించి, ఏర్పాట్లను సమీక్షించారు. ఈ ర్యాలీలో సుమారు 50వేల మంది పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకుంటున్నారు.

మరోవైపు భారత్ బచావో పేరిట ప్రపంచవ్యాప్తంగా భారత రాయబార కార్యాలయాల బయట ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలపనున్నారు. అమెరికా, ఇంగ్లాడ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఒమెన్, సౌదీ ఆరేబియాల్లో ఐఓసీ(ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్) ఈ నిరసన ప్రదర్శనలు చేపట్టనుంది.