నీట్, జేఈఈ పరీక్షలపై రేపు సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

నీట్, జేఈఈ పరీక్షలను నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఝార్ఖండ్, రాజస్థాన్ వంటి..

నీట్, జేఈఈ పరీక్షలపై రేపు సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

Edited By:

Updated on: Aug 27, 2020 | 8:04 PM

నీట్, జేఈఈ పరీక్షలను నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఝార్ఖండ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తున్నాయని అడ్వొకేట్ జనరల్ అతుల్ నందా తెలిపారు. కానీ..ఈ పరీక్షలను నిర్వహించాలన్న యోచనలో మార్పు లేదని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ మళ్ళీ స్పష్టం చేశారు. అన్ని వాదనలు ఆలకించాకే సుప్రీంకోర్టు కూడా ఇదివరకే తన నిర్ణయాన్ని తెలిపిందని ఆయన అన్నారు. అలాంటప్పుడు ఇక నిరసనలు నిర్వహించడంలో ఔచిత్యం లేదని ఆయన  చెప్పారు.విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని భంగ పరచే ఉద్దేశం లేదని ఆయన పేర్కొన్నారు.

ఈ ఎగ్జామ్స్ ని నిర్వహించాలంటూ సుమారు 150 మంది విద్యావేత్తలు ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇలా లేఖ రాసినవారిలో ఇండియాలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన అధ్యాపకులే గాక, విదేశీ యూనివర్సిటీలకు చెందిన విద్యావేత్తలు కూడా ఉన్నారు.