కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులపై ఇంత అత్యధిక ధర నిర్ణయిస్తారా ? కేంద్రంపై కాంగ్రెస్, లెఫ్ట్ ఫైర్

| Edited By: Phani CH

Apr 21, 2021 | 5:54 PM

సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ డోసులకు సంబంధించి  రాష్ట్రాలకు అధిక.ధరలను  నిర్ణయించడాన్నికాంగ్రెస్,, లెఫ్ట్ పార్టీలు తప్పు పడుతూ...  కేంద్రాన్ని  దుమ్మెత్తిపోశాయి. కేంద్రానికి,  రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒకే  ధర ఉండాలని ఈ  పార్టీలు డిమాండ్  చేశాయి.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులపై ఇంత అత్యధిక ధర నిర్ణయిస్తారా ? కేంద్రంపై కాంగ్రెస్, లెఫ్ట్ ఫైర్
Covishield
Follow us on

సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ డోసులకు సంబంధించి  రాష్ట్రాలకు అధిక.ధరలను  నిర్ణయించడాన్నికాంగ్రెస్,, లెఫ్ట్ పార్టీలు తప్పు పడుతూ…  కేంద్రాన్ని  దుమ్మెత్తిపోశాయి. కేంద్రానికి,  రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒకే  ధర ఉండాలని ఈ  పార్టీలు డిమాండ్  చేశాయి. సీరం సంస్థ  రాష్ట్రాలకు డోసు 400  రూపాయలు, ప్రైవేటు ఆసుపత్రులకు  డోసు 600 రూపాయలకు అమ్ముతామని, రాష్ట్రాలు ఈ ‘సౌలభ్యాన్ని’ వినియోగించుకోవాలని కోరింది. అయితే   కేంద్రం మాత్రం ఈ వ్యాక్సిన్ డోసు 150 రూపాయల చొప్పున కొనుగోలు  చేస్తూనే ఉంది. సీరం కంపెనీ ఈ ధరలను ప్రకటించగానే. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ   ఇది అన్యాయమని అన్నారు. ఇది ప్రధాని మోదీ మిత్రులకు లభించిన అవకాశమని, కేంద్ర  ప్రభుత్వానికి జరిగిన అన్యాయమని ట్వీట్  చేశారు.’ఆప్ కే దేశ్ ..హై ..అవసర్  మోదీ మిత్రోన్ కా’ ..అన్యాయ్  కేంద్ర  సర్కార్ కా ‘ అని   పేర్కొన్నారు.

ఇప్పటికే రాష్ట్రాలు నిధుల కటకటను ఎదుర్కొంటున్నాయని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్  చేశారు.ఈ కొత్త ధరలు వాటిపై  రుద్దిన అరాచక చర్యగా ఆయన అభివర్ణించారు. సీపీఎం  సీనియర్ నేత సీతారాం ఏచూరి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ధరలను అంగీకరించబోమన్నారు. పీఎం కేర్స్ ఫండ్ లో ఉన్న లక్షల కోట్ల రూపాయలను ప్రధాని ఖర్చు చేయాలనీ, రాష్ట్రాలపై అధిక ధరలను మోపరాదని ఆయన కోరారు.  సీరం సంస్థ నిర్ణయం వెనుక ఏవైనా అదృశ్య శక్తులు ఉన్నాయా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.  ఇలా ఉండగా దేశంలో కోవిద్ కేసులు  పెరిగిపోతున్న నేపథ్యంలో.. రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీల నుంచి దాన్ని కొనుగోలు చేయాలనీ కేంద్రం సూచించింది.  దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎలాంటి స్పందనను తెలియజేయలేదు.  ఇది తమకు అనుకూలిస్తుందా అని తర్జన భర్జన పడుతున్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Covid Pandemic: నెల్లూరులో కోవిడ్ బాధితుల పట్ల టీవీ9 కథనం.. కదిలివచ్చిన పోలీసులు

Rangasthalam Movie Tamil Teaser : రామ్ చరణ్ రంగస్థలం మూవీ తమిళ్ వెర్షన్ టీజర్ వాయిదా పడింది