CM KCR in Aurangabad :‘‘ముంబయి దేశ ఆర్థిక రాజధాని.. కానీ, తాగేందుకు నీళ్లుండవా?” : సీఎం కేసీఆర్

|

Apr 24, 2023 | 8:56 PM

BRS Public Meeting in Aurangabad Live Updates గతంలో నాందేడ్, కాందర్ లోహ సభలు సక్సెస్ అవ్వడంతో మంచి జోష్‌లో ఉంది బీఆర్ఎస్. తాజాగా ఔరంగబాద్‌లోని జబిందా గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఔరంగాబాద్‌లో పలు ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ కటౌట్లు ఏర్పాట్లు చేశారు.

CM KCR in Aurangabad :‘‘ముంబయి దేశ ఆర్థిక రాజధాని.. కానీ, తాగేందుకు నీళ్లుండవా? : సీఎం కేసీఆర్
Cm KCR Public Meeting

గోదావరి, కృష్ణా వంటి నదులున్నా.. మహారాష్ట్రకు నీటి సమస్య ఎందుకు వస్తోందని ప్రశ్నించారు మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ వేదికగా జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.  ఔరంగాబాద్‌, అకోలాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు.   పేదలు మరింత నిరుపేదలుగా మారుతున్నారు. ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు. ఎంత త్వరగా మేలుకుంటే.. దేశం అంత త్వరగా బాగుపడుందన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పరిస్థితులు ఎందుకు మారడం లేదని ప్రశ్నించారు. ఇది ఇలాగే జరగాలా.. చికిత్స చేయాలా.. అని సీఎం ప్రజలను అడిగారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కేసీఆర్ కోరారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Apr 2023 08:52 PM (IST)

    స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండి

    ఎంత త్వరగా మేలుకుంటే.. దేశం అంత త్వరగా బాగుపడతామని కేసీఆర్‌ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు కేసీఆర్. మొత్తంగా మరాఠ్వాడాలో మూడో బహిరంగసభను విజ‌య‌వంతంగా నిర్వ‌హించింది బీఆర్ఎస్. అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌ నినాదంతో మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తుంది.

  • 24 Apr 2023 08:48 PM (IST)

    పెద్ద రాష్ట్ర‌మ‌ని చెప్పుకునే మ‌హారాష్ట్ర‌లో చీఫ్ సెక్ర‌ట‌రీ ఉండ‌రా..?

    మేకిన్ ఇండియా అని చెప్పడం కాదు.. సిటీలలో వీధి వీధికో చైనా బ‌జార్ ఉందన్నారు కేసీఆర్. డిజిట‌ల్ ఇండియా మ‌జాక్ అయిందని.. మేకిన్ ఇండియా జోక్ అయిందని కేసీఆర్ పేర్కొన్నారు. మ‌హారాష్ట్ర‌లో  చీఫ్ సెక్ర‌ట‌రీ ఎందుకు ఉండ‌రని కేసీఆర్ ప్రశ్నించారు.

  • 24 Apr 2023 08:46 PM (IST)

    మ‌హారాష్ట్ర‌లో ద‌ళిత‌బంధు, రైతుబంధు ఎందుకు లేవ్

    కేసీఆర్‌కు మ‌హారాష్ట్ర‌లో ఏం ప‌ని అని ఫ‌డ్న‌వీస్ అంటున్నారని… తెలంగాణ లాంటి మోడ‌ల్ మ‌హారాష్ట్ర‌లో తీసుకొస్తే తానెందుకు ఈ ప్రాంతానికి వస్తానని కేసీఆర్ ప్రశ్నించారు. దమ్ముంటే మ‌హారాష్ట్ర‌లో ద‌ళిత‌బంధు, రైతుబంధు అమ‌లు చేయాలన్నారు. అంబేద్క‌ర్ జ‌న్మించిన నేల‌పై ద‌ళితుల‌ను ప‌ట్టించుకోరా..? అని కేసీఆర్ ప్రశ్నించారు.  నూత‌నంగా నిర్మించే పార్ల‌మెంట్‌కు అంబేద్క‌ర్ పేరు పెట్టాలని సీఎం డిమాండ్ చేశారు.

  • 24 Apr 2023 08:44 PM (IST)

    తెలంగాణలో రైతు చనిపోతే బీమా కల్పిస్తున్నాం

    తెలంగాణ‌లో ప్ర‌తీ ఎక‌రానికి రూ. 10 వేలు ఇస్తున్నామన్నారు కేసీఆర్. రైతు చ‌నిపోతే బీమా క‌ల్పిస్తున్నట్లు తెలిపారు.  మ‌హారాష్ట్ర‌లో ఇవన్నీ ఎందుకు అమ‌లు కావ‌డం లేదన్నారు. ఇంకెంత‌కాలం ప‌రిష్కారం కోసం ఎదురుచూడాలని సీఎం ప్రశ్నించారు.  ఈ స‌మ‌స్య‌ల‌ను మ‌న‌మే ప‌రిష్క‌రించుకోవాలన్నారు కేసీఆర్.

  • 24 Apr 2023 08:42 PM (IST)

    తెలంగాణ మంచి నీటికి కొరత అనేదే లేదు

    తెలంగాణ‌లో మంచినీటి స‌మస్య లేకుండా చేశామన్నారు కేసీఆర్. తెలంగాణ‌లో వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల నాణ్య‌మైన క‌రెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. రైతుల‌కు ఎరువులు స‌కాలంలో అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణ‌లో భూముల రిజిస్ట్రేష‌న్లు పావుగంట‌లో అవుతున్నాయన్నారు. రైతులకు సాగునీరు అందిస్తున్నామన్నారు.

  • 24 Apr 2023 08:41 PM (IST)

    దేశంలో మార్పు తెచ్చేందుకు బీఆర్‌ఎస్ పోరాటం

    కొత్త పార్టీ అన‌గానే కొంద‌రు అప‌వాదులు సృష్టిస్తారని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్‌పై న‌మ్మకం ఉంచమని ప్రజలను కోరారు. ఎన్ని అవాంత‌రాలు సృష్టించినా వెనుక‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేదన్నారు. అన్ని వ‌ర్గాల వారికి స‌రైన న్యాయం ద‌క్కాల్సిందే అన్నారు.   దేశంలో మార్పు తీసుకువ‌చ్చేందుకు బీఆర్ఎస్ ఏర్ప‌డింది. మార్పు వ‌చ్చే వ‌ర‌కు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉందన్నారు.

  • 24 Apr 2023 08:37 PM (IST)

    బీఆర్ఎస్ పుట్టిందే అందుకు..

    బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే మార్పు తీసుకురావడానికి అని సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ అన‌గానే కొంద‌రు అప‌వాదులు సృష్టిస్తారన్న కేసీఆర్.. ఎన్ని అవాంత‌రాలు సృష్టించినా వెనుక‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేదని తేల్చి చెప్పాడు. బీఆర్ఎస్‌పై న‌మ్మకం ఉంచండి. ఒక‌ కులం, మ‌తం, వ‌ర్గం కోసం బీఆర్ఎస్ ఆవిర్భ‌వించ‌లేదు. దేశంలో మార్పు తీసుకువ‌చ్చేందుకు బీఆర్ఎస్ ఏర్ప‌డింది. మార్పు వ‌చ్చే వ‌ర‌కు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

  • 24 Apr 2023 08:16 PM (IST)

    దేశంలో ఈ పరిస్థితికి కారణం ఎవరు

    ఔరంగాబాద్‌లో వారానికి ఒకసారి మాత్రమే తాగునీరు వస్తున్నాయని కేసీఆర్ అన్నారు. స్వాంతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఈ పరిస్థితికి కారణం ఎవరని ప్రశ్నించారు కేసీఆర్. మహారాష్ట్ర ద్వారా అన్ని నదులు ప్రవహిస్తున్నా.. ఈ కర్మ ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు..

  • 24 Apr 2023 08:13 PM (IST)

    దేశ ఆర్థిక రాజధానిలో ప్రజలకు తాగునీరు లేదు

    దేశంలో ఏం జరగుతుందో గమనించాలని కేసీఆర్ అన్నారు. ప్రజలకు సాగు, తాగునీరు అందించని పాపం ఎవరిదని ప్రశ్నించారు. దేశం పురోగమిస్తుందో..? తిరోగమిస్తుందో ప్రజలు ఆలోచించాలన్నారు. పేదలు మరింత నిరుపేదలుగా మారుతున్నారని కేసీఆర్ చెప్పారు. నా మాటలు ఇక్కడ విని.. ఇక్కడే మర్చిపోకండని.. గ్రామాలకు వెళ్లి చర్చింలన్నారు కేసీఆర్.

  • 24 Apr 2023 08:08 PM (IST)

    మ‌రాఠా ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ అభివాదం

    మ‌రాఠా ప్ర‌జ‌ల‌కు స‌భా వేదిక‌పై నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అభివాదం చేశారు. ఔరంగాబాద్‌కు చెందిన నాయ‌కుల‌ను కేసీఆర్ పలకరించారు . కేసీఆర్ స‌మ‌క్షంలో ప‌లువురు నాయ‌కులు.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారంద‌రికీ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సీఎం ఆహ్వానించారు.

  • 24 Apr 2023 08:02 PM (IST)

    లక్షన్నర మందితో భారీ బహిరంగ సభ

    ఈ ప్రాంతంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువ అని చెబుతున్న బీఆర్‌ఎస్‌ నాయుకులు … ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అన్న నినాదం విస్తృత చర్చకు కారణమతున్నదని అంటున్నారు. ఛత్రపతి శంభాజీనగర్‌ ఔరంగాబాద్‌ జిల్లాకు చెందిన పలు పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. సభా ప్రాంగణంలో టెంట్లు ఏర్పాటు చేశామని, పురుషులు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

  • 24 Apr 2023 07:52 PM (IST)

    ఉత్సాహంగా బీఆర్ఎస్ బహిరంగ సభ

    గతంలో నాందేడ్, కాందర్ లోహ సభలతో మహారాష్ట్ర రాజకీయాల్లో దృష్టిని ఆకర్షించిన బీఆర్ఎస్.. ఇప్పుడు ఔరంగాబాద్‌లో సభ నిర్వహిస్తుంది. బహిరంగ సభలను ఘనంగా నిర్వహించే బీఆర్ఎస్.. ఔరంగాబాద్ సభకూ అదే స్థాయిలో ఏర్పాట్లు చేసింది. తెలంగాణ తరహా అభివృద్ధి దేశమంతటా అవసరమని బీఆర్‌ఎస్ ప్రచారం చేస్తుంది.

Follow us on