Cloudburst near Amarnath cave: ఉత్తర భారతదేశంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జమ్మూకాశ్మీర్‌లోని పవిత్ర అమర్‌నాథ్ ఆలయం సమీపంలో మంచుచరియలు విరిగిపడ్డాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో బుధవారం మధ్యాహ్నం.. ఆలయ గుహకు సమీపంలో మంచు చరియలు విరిగిపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. ఈ ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాలకు సంబంధించిన సమాచారం రాలేదని అధికారులు వెల్లడించారు. అయితే.. గుహ దగ్గర యాత్రికులు ఎవరూ లేరని అందుకే ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు.
అయితే.. ప్రమాదం అమర్‌నాథ్ గుహకు సమీపంలోనే జరిగిందని చెబుతున్నారు. ఈ సంఘటనలో రెండు గుడారాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం సాధారణ ప్రజలకు, యాత్రికులకు అనుమతించలేదు. ఈ ఏడాది యాత్రను సైతం రద్దు చేశారు. అయితే.. యాత్రను రద్దుచేసిన దృష్ట్యా భక్తులకు పలు ఆన్‌లైన్ సేవలను ప్రారంభిస్తూ.. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు ఇటీవల నిర్ణయం తీసుకుంది.
Also Read: