భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తత చాలా సీరియస్.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

| Edited By: Pardhasaradhi Peri

Jun 25, 2020 | 2:49 PM

భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు రేగడం చాలా సీరియస్ విషయమని, తమ సరిహద్దుల సమస్యలను అవి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. తూర్పు లడాఖ్ ప్రాంతంలో ఇలా ఉద్రిక్తతలు పెచ్చరిల్లడం తీవ్రమైన విషయమే గాక...

భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తత చాలా సీరియస్.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
Boris-Johnson
Follow us on

భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు రేగడం చాలా సీరియస్ విషయమని, తమ సరిహద్దుల సమస్యలను అవి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. తూర్పు లడాఖ్ ప్రాంతంలో ఇలా ఉద్రిక్తతలు పెచ్చరిల్లడం తీవ్రమైన విషయమే గాక.. ఆందోళన కలిగించే అంశమన్నారు. అయితే పరిస్థితిని తాము ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామన్నారు. హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రశ్నోత్తరాల సందర్భంగా కన్సర్వేటివ్ సభ్యుడు ఫ్లిక్ డ్రుమాండ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. పొరుగు దేశాల మధ్య సఖ్యత ఉండాలన్నారు. కామన్వెల్త్ లో సభ్యత్వం గల ఒక దేశానికి, ప్రపంచంలోనే అతి పెద్దదైన ఓ ప్రజాస్వామిక దేశానికి మధ్య వివాదం రేగడం దురదృష్టకరమన్నారు. లడాఖ్ లోని పాంగాంగ్ సో, గాల్వన్ లోయ, డెమ్ ఛోక్, దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతాల్లో ఇండో-చైనా దళాల మధ్య ఉద్రిక్తత తలెత్తడంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇలా తొలిసారిగా స్పందించారు.