గుజరాత్ ను వీడని వర్షాలు.. వడోదరను ‘ ముంచెత్తుతున్న మొసళ్ళు ‘

| Edited By:

Aug 04, 2019 | 12:38 PM

భారీ వర్షాలు, వరదలతో గుజరాత్ సతమతమవుతోంది. ముఖ్యంగా వడోదర, కచ్ వంటి జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో వీధులు నిండిపోతున్నాయి. వడోదరలో గత 24 గంటల్లో 500 మి. మీ. వర్షంపడింది. నదులనుంచి వస్తున్న ప్రవాహంతో మొసళ్ళు కొట్టుకువస్తున్నాయి. అవి కుక్కల సమీపంలో రావడం, జనావాసాల ప్రాంతాల్లో కనిపించడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. సోషల్ మీడియాలో వీటి తాలూకు వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. శనివారం సాయంత్రం వడోదరలో నీటితో […]

గుజరాత్ ను వీడని వర్షాలు.. వడోదరను   ముంచెత్తుతున్న మొసళ్ళు
Follow us on

భారీ వర్షాలు, వరదలతో గుజరాత్ సతమతమవుతోంది. ముఖ్యంగా వడోదర, కచ్ వంటి జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో వీధులు నిండిపోతున్నాయి. వడోదరలో గత 24 గంటల్లో 500 మి. మీ. వర్షంపడింది. నదులనుంచి వస్తున్న ప్రవాహంతో మొసళ్ళు కొట్టుకువస్తున్నాయి. అవి కుక్కల సమీపంలో రావడం, జనావాసాల ప్రాంతాల్లో కనిపించడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. సోషల్ మీడియాలో వీటి తాలూకు వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. శనివారం సాయంత్రం వడోదరలో నీటితో నిండిన వీధిలో సుమారు అయిదు అడుగుల పొడవున్న మొసలి కనిపించడంతో స్థానికులు వెంటనే అధికారులకు సమాచారమందించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్ అక్కడికి చేరుకొని దాన్ని రక్షించారు. ఆ మొసలి నోటిఫై ముందుగా ఓ టవల్ విసిరి.. అనంతరం దాని నోటిని తాడుతో కట్టేసి.. . దాన్ని మొసళ్ల సంరక్షక కేంద్రానికి తరలించారు.
ఈ వీధికి సమీపంలోనే మరో మూడు మొసళ్లను రక్షించినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. కాగా- ఖారి, విశ్వామిత్ర నదులు పొంగి పొర్లుతున్న కారణంగా కచ్ జిల్లాలోనూ వీటి ‘ తాకిడి ‘ ఎక్కువైంది. భుజ్ విమానాశ్రయానికి దారి తీసే రోడ్డులో ఒక మొసలిపైనుంచి గుర్తు తెలియని వాహనమొకటి వెళ్లడంతో అది మరణించింది. జిల్లాలో ఈ నాలుగైదు రోజుల్లోనే తాము మొత్తం 15 మొసళ్లను, నాలుగు పాములను రక్షించినట్టు అటవీశాఖ సిబ్బంది తెలిపారు. వీధుల్లో ఇవి ఎక్కువగా కనిపించడం ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. అసలే భారీ వర్షాలు, వరదలతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రమాదకరమైన ప్రాణులు సంచరించడం వారిని భీతావహులను చేస్తోంది.