గ్రహణం వేళ కర్నాటకలో ఘోరం.. దివ్యాంగ బాలుడిని మెడ వరకు…

| Edited By:

Dec 26, 2019 | 12:12 PM

గ్రహణం వేళ కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. విజయ్‌‌పూర్ జిల్లా అర్జునగి పీకే గ్రామంలో మూఢనమ్మకాల నెపంతో ఓ దివ్యాంగ బాలుడిని పాక్షిక ఖననం చేశారు. సూర్యగ్రహణం వేళ.. దివ్యాంగులను మట్టిలో పూడ్చిపెడితే.. అంగవైకల్యం పోతుందన్న మూఢనమ్మకంతో.. ఓ దివ్యాంగ చిన్నారిని బురదలో మెడ వరకు పూడ్చిపెట్టారు. ఆ బాధిత చిన్నారి బాధతో విలవిల్లాడినా.. పక్కనే ఉన్న తల్లిదండ్రులు మాత్రం ఏడుస్తున్నారే తప్ప.. బాలుడి బాధను మాత్రం అర్ధం చేసుకోలేదు. అయితే ప్రతి గ్రహణ సమయంలో ఇలాంటి ఘటనలు […]

గ్రహణం వేళ కర్నాటకలో ఘోరం.. దివ్యాంగ బాలుడిని మెడ వరకు...
Follow us on

గ్రహణం వేళ కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. విజయ్‌‌పూర్ జిల్లా అర్జునగి పీకే గ్రామంలో మూఢనమ్మకాల నెపంతో ఓ దివ్యాంగ బాలుడిని పాక్షిక ఖననం చేశారు. సూర్యగ్రహణం వేళ.. దివ్యాంగులను మట్టిలో పూడ్చిపెడితే.. అంగవైకల్యం పోతుందన్న మూఢనమ్మకంతో.. ఓ దివ్యాంగ చిన్నారిని బురదలో మెడ వరకు పూడ్చిపెట్టారు. ఆ బాధిత చిన్నారి బాధతో విలవిల్లాడినా.. పక్కనే ఉన్న తల్లిదండ్రులు మాత్రం ఏడుస్తున్నారే తప్ప.. బాలుడి బాధను మాత్రం అర్ధం చేసుకోలేదు. అయితే ప్రతి గ్రహణ సమయంలో ఇలాంటి ఘటనలు కర్నాటక ప్రాంతంలో జరుగుతాయని స్థానికులు చెప్తున్నారు. ఒక్క విజయ్‌పూర్‌ జిల్లాలోనే కాకుండా.. అటు గుల్బర్గాలో కూడా గ్రహణ సమయంలో దివ్యాంగ చిన్నారులను మట్టి బురదలో మెడ వరకు పాతిపెట్టేస్తారని తెలుస్తోంది. ఓ వైపు మూఢనమ్మకాలు నమ్మవద్దంటూ జన విజ్ఙాన వేదిక సభ్యులు  ఎన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినా.. ప్రజల్లో మాత్రం ఏలాంటి మార్పులు రావడం లేదు.