Viral: డ్యూటీలో ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌కు రోడ్డు పక్కన కనిపించిన బ్యాగ్.. ఏముందా అని చెక్ చేయగా..

|

Jul 24, 2022 | 2:27 PM

ప్రజంట్ సొసైటీ డబ్బుకు ఎంత వాల్యూ ఇస్తుందో చూస్తున్నాం. అయినవాళ్ల కాస్త ఎక్కువ ఆస్తి వెళ్తున్నా తట్టుకోలేకపోతున్నారు కొందరు. కానీ ఓ ట్రాఫిక్ పోలీస్ తన మంచి మనసు చాటుకున్నాడు.

Viral: డ్యూటీలో ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌కు రోడ్డు పక్కన కనిపించిన బ్యాగ్.. ఏముందా అని చెక్ చేయగా..
Representative image
Follow us on

Trending: రోడ్డుపై వెళ్తున్నప్పుడు.. పది రూపాయల నోటు కనిపిస్తేనే.. ఎవరూ చూడకుండా చటుక్కున్న జేబులో వేసుకుని.. గుటుక్కున ఎస్కేప్ అయ్యే జనాలు ఉన్న సొసైటీ మనది. డబ్బు, విలువైన వస్తువులు దొరికినప్పుడు కూడా.. పొగొట్టుకున్న వారికి అవి ఎంత అవసరమో, ఎంత టెన్షన్‌లో ఉండి వాటిని మిస్ చేసుకున్నారో కూడా పట్టించుకోరు చాలామంది. చప్పిడికాకుండా దొరికినవాటిని ఇంటికి తీసుకెళ్తారు. కానీ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం.. తన నిజాయితీని చాటుకున్నాడు. 1 కాదు.. 2 కాదు… ఏకంగా 45 లక్షలు రోడ్డు పక్కన పక్కన దొరికితే..  ఆ సొమ్మంతా పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పాడు. ఒక పోలీస్‌గా మాత్రమే కాకుండా ఓ మంచి మనసున్న వ్యక్తిగా తన బాధ్యతను నిర్వర్తించాడు. వివరాల్లోకి వెళ్తే..  ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) రాష్ట్రానికి చెందిన నీలాంబర్‌ సిన్హా రాయ్‌పుర్‌లోని కాయబంధా(Kayabandha) ఏరియా వద్ద ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా డ్యూటీ చేస్తుంటాడు. శనివారం ఎప్పటిలాగే విధుల్లో ఉండగా.. రోడ్డు పక్కన ఓ బ్యాగ్‌ కనిపించింది. ఆ చుట్టు పక్కల వెతికినా ఎవరూ కనిపించలేదు. ఈ క్రమంలో బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా.. లోపల కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి.  అన్నీ రూ.500, రూ.2వేల నోట్లే. ఆ డబ్బును చూసిన వెంటనే అతనికి దురాశ కలగలేదు. వెంటనే డబ్బుతో నిండి ఉన్న బ్యాగ్‌ను తీసుకెళ్లి స్థానిక పోలీసులకు అప్పజెప్పేశాడు. అందులో  రూ.45లక్షలు గుర్తించారు.

నీలాంబర్‌ హానిస్టీకి మెచ్చి తోటి పోలీసులు ఫిదా అయ్యారు. ఉన్నతాధికారులు ఆయనకు రివార్డు కూడా ఇచ్చారు. అయితే ఆ డబ్బు ఎవరిది అన్న వివరాలు తెలియరాలేదు. దగ్గర్లోని సీసీ పుటేజ్ సేకరించి విచారణ జరుపుతున్నారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు నీలాంబర్‌ నిజాయతీకి ఫిదా అవుతున్నారు.

Police Honesty

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..