Metro Charges: మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త.. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు మెట్రో చార్జీల తగ్గింపు

|

Feb 04, 2021 | 4:25 PM

Metro Charges: ప్రయాణికులను ఆకట్టుకునేందుకు మెట్రో రైలు అధికారులు రాయితీలు ప్రకటిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త...

Metro Charges: మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త.. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు మెట్రో చార్జీల తగ్గింపు
Follow us on

Metro Charges: ప్రయాణికులను ఆకట్టుకునేందుకు మెట్రో రైలు అధికారులు రాయితీలు ప్రకటిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెబుతూ చార్జీలు తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది చెన్నై మెట్రో రైలు సంస్థ. ప్రయాణికుల సంఖ్య పెంచే దిశగా మెట్రో రైలు చార్జీలను రూ.50కు తగ్గించింది. మెట్రో రైలు సేవలు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇతర నగరాలతో పోల్చితే చెన్నై మెట్రో రైలు చార్జీలు కాస్త అధికంగానే ఉన్నాయి. కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉండటంతో ప్రభుత్వం మెట్రో రైలు సేవలను పూర్తిగా నిలిపివేసింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన తర్వాత గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి మళ్లీ మెట్రో సేవలు ప్రారంభం అయ్యాయి. అప్పటి నుంచి జనవరి వరకు దాదాపు 44.96 లక్షల మందికి పైగా ప్రయాణించారు.

ఉత్తర చెన్నైలోని వాషర్‌మెన్‌పేట నుంచి వింకోనగర్‌ వరకు చేపట్టనున్న మెట్రో రైలు మార్గం విస్తరణ పథకాన్ని ఈనెల 14న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తున్నట్లు ముందుగా సీఎంఆర్‌ఎల్‌ ప్రకటించింది. అయితే ఈ పనులు పూర్తి కాకపోవడంతో మెట్రో విస్తరణ వాయిదా పడే అవకాశం ఉంది. దీనిని మళ్లీ నెలాఖరులోగా లేదా మార్చిలోగా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారని గవర్నర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం మెట్రో చార్జీలు అత్యల్పంగా రూ.10, అత్యధికంగా రూ.60 వసూలు చేస్తున్నారు. అయితే అత్యధిక చార్జీని రూ.50కి తగ్గించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం, సెలవు దినాల్లో పర్యటించే వారికి రాయితీలు కల్పిస్తున్నారు. అలాగే సీనియర్‌ సిటిజన్లకు కూడా టికెట్‌ ధరలో రూ.50శాతం వరకు రాయితీ కల్పిస్తోంది చెన్నై మెట్రో సంస్థ.

Post Office Monthly Income Scheme: అదిరిపోయే బెనిఫిట్.. పోస్టాఫీసులో ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.5 వేల ఆదాయం