Cheetahs: 74 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా నుంచి భారత అడవుల్లో అడుగుపెట్టనున్న చిరుతలు.. ప్రభుత్వం ఏర్పాట్లు

|

May 23, 2021 | 10:20 PM

Cheetahs: వేగానికి మారు పేరైన చిరుత పులులు త్వరలో భారత్‌ అడవుల్లోకి రానున్నాయి. దాదాపు 74 ఏళ్ల కిందట మన దేశంలో అంతరించిపోయిన చిరుత పులులు.. ఇప్పుడు ఆఫ్రికా నుంచి రప్పించి..

Cheetahs: 74 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా నుంచి భారత అడవుల్లో అడుగుపెట్టనున్న చిరుతలు..  ప్రభుత్వం ఏర్పాట్లు
Cheetah
Follow us on

Cheetahs: వేగానికి మారు పేరైన చిరుత పులులు త్వరలో భారత్‌ అడవుల్లోకి రానున్నాయి. దాదాపు 74 ఏళ్ల కిందట మన దేశంలో అంతరించిపోయిన చిరుత పులులు.. ఇప్పుడు ఆఫ్రికా నుంచి రప్పించి మన అడవుల్లో వదలాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. జీవవైవిధ్యాన్ని కాపాడే యత్నంలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపట్టింది. దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 10 చిరుత పులులను భారత్‌కు తీసుకురానున్నారు. ఇందులో భాగంగా ఐదు చిరుతలు మగవి, ఐదు చిరులు ఆడవి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వీటి కోసం కునో నేషనల్‌ పార్కు ఏర్పాటు :

కాగా, ఈ చిరుతల కోసం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని చంబల్‌ లోయలో ఉన్న కునో నేషనల్‌ పార్కులో ప్రత్యేక ఏర్పా్ట్లు చేస్తున్నారు. ఈ చంబల్‌ ప్రాంతంలో ఉన్న ఈ పార్క్‌ 750 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ చిరుతలకు అనువైన వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే దక్షిణాఫ్రికాకు చెందిన ఒక నిపుణుడు ఈ ఏడాది ఏప్రిల్‌ 26న డబ్ల్యూఐఐ శాస్త్రవేత్తలతో కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇందుకు ఆయన సంతృప్తి వ్యక్తం చేసినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. వచ్చే అక్టోబర్‌ లేదా నవంబర్‌ నెలలో దక్షిణాఫ్రి నుంచి ఈ చిరుతలు మన అడవుల్లోకి రానున్నాయి.

భారత్‌ అడవుల్లో చిరుతలను తీసుకువచ్చేందుకు వైల్డ్‌ ఆఫ్‌ ఇండియా ప్రయత్నాలు చేస్తుండగా, ప్రభుత్వం అంగీకరించి రూ.14 కోట్ల నిధులు కేటాయించింది. గతంలో చిరుతలు అధికంగా నివసించిన మధ్యప్రదేశ్‌లోనే వాటికి ఆవాసం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ ఏర్పాట్లను పరిశీలించిన ఆఫ్రికా అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆఫ్రికన్‌ చిరుతలను భారత్‌ అడవుల్లో ప్రవేశపెట్టేందుకు సుప్రీం కోర్టు ఇంతకు ముందే అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టుపై మార్గనిర్దేశం చేసేందుకు సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యుల కమిటీ కూడా ఏర్పాటు చేసింది.

కాగా, జీవవైవిధ్యానికి భారత్‌లో పెద్ద పులులతో పాటు చిరుతలు అధిక సంఖ్యలో ఉండేవి. అయితే స్వాతంత్ర్యానికి పూర్వం రాజులు, బ్రిటీషర్లు వేట పేరుతో వందలాది చిరుత పులులను హతమార్చారు. దీంతో చిరుతల సంఖ్య తగ్గిపోయింది. భారత్‌లో చిట్టచివరి చిరుతని 1947లో ఛత్తీస్‌గఢ్‌లో చూసినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. దీంతో దేశంలో చిరుతలు అంతరించి పోయాంటూ 1952లో ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి దేశంలో చిరుతల జాడ లేకుండా పోయింది. ఇప్పుడు తాజాగా మళ్లీ చిరుతలు భారత్‌లో అడుగు పెట్టనున్నాయి.

ఇవీ చదవండి:

LPG Gas: షాకింగ్‌ న్యూస్‌.. ఈనెల 29 నుంచి తెలంగాణలో ఎల్పీజీ గ్యాస్‌ హోమ్‌ డెలివరీ నిలిపివేత.. ఎందుకంటే..!

Cyclone Yaas: : యాస్ తుఫాన్ తీవ్రమవుతున్న నేపధ్యంలో మెడికల్ ఆక్సిజన్‌ సరఫరా, నిల్వ, తయారీపై యుద్ధప్రాతిపదికన ఏపీ సర్కారు చర్యలు