Liquor Home Delivery: మందుబాబులకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. లాక్‌డౌన్ కారణంగా మద్యం షాపులు మూసి ఉన్నప్పటికీ.. ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే… మద్యాన్ని హోం డెలివరీ చేసేందుకు అనుమతిచ్చింది. అక్రమంగా మద్యం తయారీని అడ్డుకోవడంతో కల్తీ మద్యం, శానిటైజర్లు తాగి ప్రజలు చనిపోతుండటం వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ అధికారి ఒకరు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి మద్యం హోం డెలివరీ ప్రారంభం కానుందని.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా హోం డెలివరీలకు అనుమతి ఉందని చెప్పుకొచ్చారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి డబ్బులు చెల్లిస్తే.. సమీపంలోని షాపు నుంచి మద్యం హోం డెలివరీ ఇస్తారని చత్తీస్‌గఢ్ రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీఎస్‌ఎంసీఎల్) తెలిపింది.
సీఎస్‌ఎంసీఎల్ వైబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆర్డర్స్ చేయవచ్చునని.. హోం డెలివరీకి అదనంగా రూ. 100 ఛార్జ్ చేయనున్నట్లు తెలిపారు. కాగా, గతేడాది లాక్‌డౌన్‌లోనూ చత్తీస్‌గఢ్ సర్కార్ మద్యం హోం డెలివరీకి అనుమతించిన విషయం విదితమే.
Viral Video: అరటితోటను నాశనం చేసిన గజరాజులు.. ఆ ఒక్క చెట్టు తప్ప.. ఎందుకంటే.!
Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!
Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!