Covid Vaccination: కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై వర్క్ ప్లేస్‌లలోనూ కోవిడ్ వ్యాక్సినేషన్‌కు అనుమతి.!

|

Apr 07, 2021 | 6:45 PM

Covid 19 Vaccination: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ డోసులు..

Covid Vaccination: కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై వర్క్ ప్లేస్‌లలోనూ కోవిడ్ వ్యాక్సినేషన్‌కు అనుమతి.!
Covid Vaccination
Follow us on

Covid 19 Vaccination: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఎక్కువ మందికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇకపై కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వర్క్ ప్లేస్‌లలోనూ(ప్రభుత్వ, ప్రైవేట్) అనుమతించనుంది. పని ప్రాంతాల్లో కనీసం 100 మంది ఉంటే కోవిడ్ టీకా సెషన్లను వర్క్ ప్లేస్‌లలో అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ రాజేష్ భూషణ్ లేఖ రాశారు.

పబ్లిక్, ప్రైవేట్ సెక్టర్ సంస్థలన్నీ కూడా ఈ నెల 11వ తేదీలోగా ‘వర్క్ ప్లేస్‌ వ్యాక్సినేషన్’ ప్రక్రియ కోసం ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని తెలిపింది. టీకాను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా నాణ్యతను కేంద్రీకరించడంలో భాగంగా నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ సిఫారసు మేరకు కేంద్రం ఈ చర్యలు తీసుకుంటోంది. కాగా, వర్క్ ప్లేస్‌లలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం పలు నిబంధనలు సైతం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొదలైన మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేస్తోన్న సంగతి తెలిసిందే.

దేశంలో వేగవంతంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను ప్రజలకు వేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం భారతదేశంలో రోజుకు సగటున 30,93,861 టీకా డోసులను ఇస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో 8.70 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ ఇవ్వబడింది. గత 24 గంటల్లో 33 లక్షలకు పైగా కోవిడ్ -19 యాంటీ వ్యాక్సిన్ మోతాదులను ఇచ్చారు.

Also Read: ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!

ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!

ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!

ఆ గ్రామ ప్రజలు పేరుకే కోటీశ్వరులు.. అసలు బట్టలే ధరించరు.. పర్యాటకులకు ఇదే రూల్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!

Government