దేశంలో ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణ ?

| Edited By: Pardhasaradhi Peri

Aug 18, 2020 | 7:23 PM

దేశంలో తాజాగా ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించవచ్చు.అమృత్ సర్, ఇండోర్, రాంచీ, తిరుచ్చి, భువనేశ్వర్, రాయపూర్ విమానాశ్రయాల ప్రైవేటీకరణపై..

దేశంలో ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణ ?
Follow us on

దేశంలో తాజాగా ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించవచ్చు.అమృత్ సర్, ఇండోర్, రాంచీ, తిరుచ్చి, భువనేశ్వర్, రాయపూర్ విమానాశ్రయాల ప్రైవేటీకరణపై ఈ నెల 19 న జరిగే సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ప్రధాన నిర్ణయం తీసుకోవచ్ఛునని భావిస్తున్నారు. ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర పడిన అనంతరం ఈ ఏడాదే బిడ్డింగ్ ప్రక్రియ మొదలవుతుంది. దేశంలో మొత్తం 12 ఎయిర్ పోర్టులను ప్రైవేటు పరం చేయాలని  మోదీ ప్రభుత్వం లోగడ నిర్ణయించింది.

తొలి దశలో అహమ్మదాబాద్, మంగుళూరు,లక్నో, గౌహతి, తిరువనంతపురం, జైపూర్ ఎయిర్ పోర్టుల ప్రైవేటీకరణపై అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. కాగా మొదటగా అదానీ గ్రూప్ బిడ్డింగ్ ప్రాసెస్ లో పాల్గొనవచ్ఛు.