Shaktikanta Das: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ పునర్నియామకం..

|

Oct 29, 2021 | 9:04 AM

RBI Governor Shaktikanta Das: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని బ్యాంకులకు దిశానిర్ధేశం చేసే భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా

Shaktikanta Das: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ పునర్నియామకం..
Shaktikanta Das
Follow us on

RBI Governor Shaktikanta Das: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని బ్యాంకులకు దిశానిర్ధేశం చేసే భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌‌ను పునర్నియామకం చేసింది. శక్తికాంత దాస్‌ను పున:ర్నియామకం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌గా శక్తికాంత దాస్ మరో మూడేళ్లపాటు పదవీలో కొనసాగనున్నారు. కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన అపాయింట్‌మెంట్స్ కమిటీ ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసింది. ఆయనను అదే పదవిలో పునర్నియమిస్తున్నట్లు తాజాగా ప్రకటించిన ఉత్తర్వుల్లో వెల్లడించింది.

2021 డిసెంబర్ 10 నుంచి శక్తికాంత దాస్ ఆర్‌బీఐ గవర్నర్‌గా మూడేళ్ల పాటు పదవీలో కొనసాగుతారు. లేదా.. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ అదే పదవీలో ఉంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2021 డిసెంబర్ 10 నుంచి పునర్నియామకం అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన అపాయింట్‌మెంట్స్ కమిటీ ప్రకటించింది. శక్తికాంత దాస్ డిసెంబర్ 2018లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్‌గా నియమితులయ్యారు. అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలోని రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పని చేశారు. పదవీ విరమణ చేసిన ఆయన ఆ తర్వాత 15వ ఆర్థిక సంఘం సభ్యునిగా చేశారు. కాగా.. శక్తికాంతదాస్ తమిళనాడు కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.

Also Read:

Crime News: హైదరాబాద్‌లో కలకలం.. కేబీఆర్ పార్క్‌లో గుర్తు తెలియని మృతదేహం..

Crime News: ఘోరం.. మద్యం తాగేందుకు రూ.10 ఇవ్వలేదని.. స్నేహితుడిని దారుణంగా చంపారు.. చివరకు..