
న్యూఢిల్లీ, మార్చి 31: డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14న ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. సమాజానికి, రాజ్యాంగానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మార్చి 28 (శుక్రవారం) ఈ మేరకు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టారు. రాజ్యాంగ నిర్మాత, సమాజంలో సమానత్వం కోసం కొత్త శకాన్ని స్థాపించిన బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతిని ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటినట్లు తన X ఖాతాలో పోస్ట్ చేశారు. బీఆర్ అంబేద్కర్ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించడం పట్ల ప్రధాని మోదీ అంకిత భావం గుర్తించాలని ఆయన అన్నారు. దేశ ప్రజల మనోభావాలను గౌరవించి ప్రదాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.
కాగా అంబేద్కర్‌పై బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ అంబేద్కర్ జయంతిని జాతీయ సెలవు దినంగా పాటించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో జన్మించారు. నవ భారతాన్ని రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దళిత ప్రజల మనుగడ కోసం ఆయన ఏకంగా భారత రాజ్యాంగాన్ని రచించి దేశ చరిత్రలో నూతన శకం రూపొందించారు.
संविधान के शिल्पकार, समाज में समानता के नए युग की स्थापना करने वाले हमारे बाबा साहेब पूज्य डॉ. भीमराव अंबेडकर जी की जयंती पर अब राजकीय अवकाश होगा।
बाबा साहेब के अनन्य अनुयायी आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी ने यह निर्णय लेकर राष्ट्र की भावना को सम्मान दिया है। pic.twitter.com/f8eWuKsxmd
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) March 28, 2025
కాంగ్రెస్ దళిత వ్యతిరేక పార్టీ అని 2024 డిసెంబర్‌లో రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. ఆ రోపణల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు పరస్పర వాగ్యుద్ధం చేసుకుంటున్నాయి. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బీఆర్ అంబేద్కర్ ఫోటో ‘తొలగింపు’ అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రపటాలను ఢిల్లీ సీఎం ఆఫీస్‌లో తొలగించినట్లు ప్రతిపక్ష నాయకురాలు అతిషి పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. ఈ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ పరిణామాల దృష్ట్యా అంబేద్కర్ జయంతిని కేంద్రం జాతీయ సెలవు దినంగా ప్రకటించడం విశేషం.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.