Vande Sadharan: అందరికీ అందుబాటు ధరలో వందే భారత్‌ .. త్వరలోనే పట్టాలెక్కనున్న..

|

Oct 12, 2023 | 6:33 PM

అయితే అన్ని బాగున్నా ధర విషయంలో మాత్రం వందే భారత్‌ అందరినీ ఆకర్షించలేకపోతోంది. వందే భారత్ రైళ్లు సామాన్యులకు అందుబాటులో లేవనే చెప్పాలి. అందుకే సామాన్యులకు సైతం వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ మరో నిర్ణయం తీసుకుంది. వందేభారత్‌ వేగంతో ప్రయాణించే నాన్‌ ఏసీ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వందే సాధారణ్‌ లేదా నాన్ ఏసీ పుష్ పుల్...

Vande Sadharan: అందరికీ అందుబాటు ధరలో వందే భారత్‌ .. త్వరలోనే పట్టాలెక్కనున్న..
అలాగే ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే.. ఒకే రోజున 10 మార్గాల్లో వందేభారత్ రైళ్లకు వర్చువల్‌గా పచ్చజెండా ఊపనున్నారు. వీటిలో సికింద్రాబాద్-పూణే రైలు కూడా ఉంది. అయితే ఇది వందేభారత్ రైలా లేక వందే సాధారణ్ రైలా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
Follow us on

భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని మార్చేసింది వందే భారత్‌ రైలు. అధునాతన సదుపాయాలతో కూడిన వందే భారత్ రైళ్లు భారతీయ రైల్వే చరిత్రలో ఒక సరికొత్త అధ్యయనంగా చెప్పొచ్చు. అత్యంత వేగంతో దూసుకెళ్లడమే కాకుండా విమానంలో ఉన్న సదుపాయాలు ఈ రైళ్ల ద్వారా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి కూడా భారీగా ఆదరణ లభిస్తోంది. దేశంలో దాదాపు అన్ని ప్రధాన మార్గాల్లో వందే భారత్‌ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి.

అయితే అన్ని బాగున్నా ధర విషయంలో మాత్రం వందే భారత్‌ అందరినీ ఆకర్షించలేకపోతోంది. వందే భారత్ రైళ్లు సామాన్యులకు అందుబాటులో లేవనే చెప్పాలి. అందుకే సామాన్యులకు సైతం వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ మరో నిర్ణయం తీసుకుంది. వందేభారత్‌ వేగంతో ప్రయాణించే నాన్‌ ఏసీ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వందే సాధారణ్‌ లేదా నాన్ ఏసీ పుష్ పుల్ ట్రైన్‌ పేరుతో పిలిచే ఈ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది.

ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్వయంగా తెలిపారు. ఈ రైలు ప్రత్యేకతలను ట్విట్టర్‌ వేదికగా పోస్ట్ చేశారు. ఈ నెలాఖరులోగా ట్రాయల్‌ రన్‌ నిర్వహించి, ఈ ఏడాది చివరి నాటికి ఈ రైళ్లు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని సిద్ధం చేస్తున్నారు. ఈ రైళ్లలో 12 స్పీపర్‌ కాస్‌ కోచ్‌లు, 8 జనరల్‌ కోచ్‌లు, 2 గార్డు కోచ్‌లు ఉండనున్నాయి. చిత్తరంజన్‌ లోకోమోటివ్ ఫ్యాక్టరీలో వందే సాధారణ్‌ రైళ్ల కోసం ప్రత్యేకంగా రెండు ఇంజన్‌లను తయారు చేస్తున్నారు.

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్..

ఇదిలా ఉంటే రైల్వే శాఖ వందే మెట్రో, వందే స్లీపర్‌ రైల్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వందేభారత్‌, వందే మెట్రో స్లీపర్‌ వెర్షన్‌ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ వందే భారత్‌ స్లీపర్‌ వెర్షన్‌ రైలు ఎలా ఉండనుందో తెలిపే ఓ ఫొటోను పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చిలోపు ఈ రైలు తయారు పూర్తవుతందని సమాచారం. అనంతరం వందే మెట్రోకు సంబంధించిన పనులు ప్రారంభించనున్నారు. మొత్తం మీద వీటన్నింటి రాకతో భారతీయ రైల్వే కొత్త రూపం సంతరించుకోనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..