ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

|

Sep 17, 2020 | 5:19 PM

సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుటికీ మర్చిపోరన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ విమోచన ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
Follow us on

సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుటికీ మర్చిపోరన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ విమోచన ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలలో విమోచన దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించకపోవడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆరెస్ పార్టీలు ఎంఐఎం పార్టీకి బానిసగిరి చేస్తూ విమోచన దినోత్సవం జరపడం లేదని ఆయన విమర్శించారు. నిరంకుశ నిజం పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చిన గొప్ప దినం ఇవాళ అని ఆయన కీర్తించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని తన నివాసంలో జెండా ఆవిష్కరించారు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ సోయం బాబూరావు, మాజీ ఎంపీ జి.వివేక్, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈరోజును పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తరపున స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కిషన్ రెడ్డి. ఆంధ్ర పాలకులు నిర్వహించట్లేదని ఉద్యమసమయంలో విమర్శించిన కేసీఆర్, ఇప్పుడెందుకు ఆ పని చేయట్లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.