Farmers Identity Card: ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు వీలుగా దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కార్డును అందజేనుంది. దేశవ్యాప్తంగా రైతుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు (ఐడీ) రూపొందించే ప్రక్రియ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా రైతుల డేటాబేస్‌ను సిద్ధం చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇప్పటి వరకు ఐదున్నర కోట్ల మంది రైతుల డేటాబేస్‌ను సిద్ధం చేశామని, వాటి ఆధారంగా 12 అంకెల గుర్తింపు కార్డులను అందజేస్తామన్నారు.
ప్రత్యేక గుర్తింపు కార్డుతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ కారణంగా, ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందేందుకు రైతులకు ఇకపై మధ్యవర్తుల అవసరం లేదు. ప్రత్యేక గుర్తింపు కార్డును రూపొందించడానికి పైలట్ ప్రాజెక్ట్ జరుగుతోంది. త్వరలో దేశవ్యాప్తంగా రైతులను దీని పరిధిలోకి చేర్చనున్నారు. డేటాబేస్ జాతీయ స్థాయిలో సిద్ధమైన తర్వాత, దీనిని పూర్తిగా అమలు చేయనున్నారు. డేటాబేస్‌లో చేర్చిన రైతులు మాత్రమే ప్రయోజనాలను పొందగలరు.
వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ మంగళవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ వ్యాఖ్యలు చేశారు. గుర్తింపు కార్డులను తయారు చేసే పథకంలో ఇ-నో యువర్ ఫార్మర్స్ (e-KYF) ద్వారా రైతులను ధృవీకరించే నిబంధన కొనసాగుతోంది. దీంతో వివిధ పథకాల కింద ప్రయోజనాలు పొందేందుకు వివిధ విభాగాలు, కార్యాలయాల్లో తరచూ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదని ఆయన తెలిపారు.
దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని లోక్‌సభలో కోరారు. ఈ విషయమై నరేంద్ర తోమర్ మాట్లాడుతూ దేశంలోని మొత్తం 11.5 కోట్ల మంది రైతుల్లో ఐదున్నర కోట్ల మంది రైతుల డేటాబేస్‌ను సిద్ధం చేశామన్నారు. మిగిలిన రైతుల వివరాల కోసం కసరత్తు జరుగుతోంది. ప్రధాన మంత్రి కళ్యాణ్ నిధి యోజన నుంచి సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయల సమాన వాయిదాను అందజేసే రైతులందరికీ ఈ ఐడీ ప్రయోజనం లభిస్తుంది.
పథకాల ప్రయోజనాలు పొందడంలో వెసులుబాటు..
దేశంలో రైతుల సంక్షేమంతో పాటు వ్యవసాయ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకాలను పొందేందుకు రైతులు ప్రతి సీజన్‌లోనూ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గుర్తింపు కార్డును రూపొందించిన తర్వాత, వారు ఈ పథకాల ప్రయోజనాన్ని పొందడం సులభం అవుతుంది.
దేశంలో వ్యవసాయ పథకాల్లో అనేక రకాల మోసాలు జరుగుతున్నాయని, వాటి ప్రతికూలతలతోపాటు నకిలీలు, మోసగాళ్లతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తావించారు. గుర్తింపు కార్డుగా ఉండటం వల్ల రైతులు లాభదాయకమైన అంశాలను పొందేందుకు సహాయపడుతుంది. ఈ కార్డు ద్వారా వ్యవసాయానికి సంబంధించిన వివిధ సమాచారాన్ని రైతులకు నేరుగా అందించవచ్చు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌తో చేసే ఈ ప్రయత్నం వ్యవసాయ రంగంలో పారదర్శకతను తీసుకరానుంది.
Also Read: Viral Video: వివాహ వేడుకలో వధూవరులు అత్యుత్సాహం.. గాలిలోకి 4 రౌండ్ల కాల్పులు.. పోలీసుల ఎంట్రీతో..