Farmers Protest: అలా చేయకపోతే చర్యలు తప్పవు.. ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్..

|

Feb 03, 2021 | 4:05 PM

Govt Warns Twitter: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్‌ ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. రైతుల ఆందోళ‌న‌ల‌కు సంబంధించిన హ్యాష్‌ ట్యాగ్‌లు, కామెంట్లు, అకౌంట్‌లను వెంట‌నే తొల‌గించాల‌ని..

Farmers Protest: అలా చేయకపోతే చర్యలు తప్పవు.. ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్..
Follow us on

Govt Warns Twitter: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్‌ ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. రైతుల ఆందోళ‌న‌ల‌కు సంబంధించిన హ్యాష్‌ ట్యాగ్‌లు, కామెంట్లు, అకౌంట్‌లను వెంట‌నే తొల‌గించాల‌ని, లేకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేసినా.. ట్విట‌్టర్ దానిని అమ‌లు చేయ‌క‌పోవ‌డంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. రైతుల ఉద్యమాన్ని రెచ్చగట్టెలా.. అదేవిధంగా పలువురిపై విద్వేశపూరితంగా చేసిన కామెంట్లు, హ్యాష్‌ట్యాగ్ అకౌంట్లను వెంట‌నే తొలగించాలని సూచించింది. లేకపోతే చర్యలు తప్పవంటూ నోటీసులు జారీ చేసింది.

మార‌ణ‌హోమాన్ని ప్రేరేపించ‌డం అనేది భావ ప్రకటన స్వేచ్ఛ కాద‌ని, అది శాంతి భద్రతలకు ముప్పు అవుతుంద‌ని ప్రభుత్వం పేర్కొంది. ఐటీ శాఖ ఆదేశాల త‌ర్వాత సోమ‌వారం ఉద‌యం రైతుల ఆందోళ‌న‌ల‌కు సంబంధించిన‌ 100 అకౌంట్లు, 150 ట్వీట్‌లను మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట‌్టర్ డిలీట్ చేసింది. గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనల అనంతరం.. #ModiPlanningFarmerGenocide అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాటు పలు వివాదస్పద ట్విట్టర్ అకౌంట్లను సంస్థ బ్లాక్ చేసిన అనంతరం మరలా ట్విటర్ ఏక‌ప‌క్షంగా పున:రుద్ధరించింది.

 

Also Read:

Rahul Gandhi: నియంతల పేర్లన్నీ ‘ఎం’ అక్షరంతోనే మొదలవుతున్నాయి.. రాహుల్ గాంధీ సంచలన ట్విట్..

ఢిల్లీ హింసాకాండపై పోలీసుల నజర్.. దీప్ సిధు ఆచూకీ వెల్లడిస్తే రూ.లక్ష రివార్డు.. మరికొంత మందిపై కూడా..