నూతన ఐఐటీల వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం.. తొలి విడతగా ఎన్ని నిధులు కేటాయించిందంటే..

|

Feb 04, 2021 | 1:09 PM

Details of New IITs: దేశంలో ఐఐటీల ఏర్పాటు గురించి బీజేపీ ఎంపీ వైఎస్ చౌదరి (సుజనా) అడిగిన ప్రశ్నకు కేంద్రం బదులిచ్చింది. 2014-15లో

నూతన ఐఐటీల వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం.. తొలి విడతగా ఎన్ని నిధులు కేటాయించిందంటే..
Follow us on

Details of New IITs: దేశంలో ఐఐటీల ఏర్పాటు గురించి బీజేపీ ఎంపీ వైఎస్ చౌదరి (సుజనా) అడిగిన ప్రశ్నకు కేంద్రం బదులిచ్చింది. 2014-15లో దేశంలో కొత్తగా 5 ఐఐటీలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిపింది. అందులో భాగంగా తిరుపతితో పాటు పాలక్కాడ్, భిలాయ్, జమ్ము, గోవాలో కొత్త ఐఐటీలు మంజూరయినట్లు ప్రకటించింది. 2015-16లో కర్నాటక ధార్వాడ్‌లో మరో కొత్త ఐఐటీ మంజూరు చేసినట్లు పేర్కొంది. దీంతో కలిపి కొత్తగా ఆరు ఐఐటీలు ప్రారంభంకాబోతున్నట్లు వివరించింది.

వీటి నిర్మాణం కోసం తొలి విడతగా రూ.7002.42 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించింది. భవనాలు, ఫర్నీచర్ తదితర పనులు పెండింగ్‌లో ఉండటం వల్ల ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్‌లలో కార్యాకలాపాలు కొనసాగుతున్నట్లు ప్రకటించింది. తిరుపతి ఐఐటీ శాశ్వత క్యాంపస్ కోసం భూ బదలాయింపు 2015-19 వరకు కొనసాగిందని తెలిపింది. అన్ని అనుమతులు పొందిన తర్వాత నిర్మాణ పనులు మొదలయ్యాయని పేర్కొంది. ప్రస్తుతం ఐఐటీ శాశ్వత క్యాంపస్ భవన నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నట్లు వివరించింది. విద్యార్థులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నూతన పద్దతులలో భవన నిర్మాణాలు జరుగుతున్నట్లు తెలిపింది.

వాహనదారులూ బీ అలర్ట్.. ఫాస్టాగ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వారికే అనుమతి..