Central Govt on Kaleshwaram Project: తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చిచెప్పింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు కింద చేర్చడానికి అర్హత లేదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు.. కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2016, 2018లో సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని మోడీని రెండు సార్లు కలిసి కోరారని వెల్లడించారు. అయితే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి.. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి క్లియరెన్స్‌లు తీసుకోలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ కూడా లేదని లోక్‌సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు బిశ్వేశ్వర్ వివరించారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని.. జాతీయ ప్రాజెక్ట్ స్కీంలో చేర్చే అర్హత లేదంటూ స్పష్టంచేశారు. అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాలి, హై పవర్ కమిటీ అనుమతిస్తే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంటుందంటూ వివరించారు. కాళేశ్వరానికి పెట్టుబడుల అనుమతులు కూడా లేవని కేంద్ర జలశక్తిశాఖ ఈ మేరకు గురువారం స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి