Cyrus Mistry Death News: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు ముంబై (Mumbai)లో ముగిశాయి. పలువురు పారిశ్రామికవేత్తలు మిస్త్రీ అంత్యక్రియలకు హాజరయ్యారు. గత ఆదివారం పాల్ఘర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ, మరో వ్యక్తి చనిపోయారు. సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంపై ముంబై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పలు కోణాల్లో లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
ప్రమాదానికి గురైన మెర్సిడెస్ బెంజ్ కారు చిప్‌ను పోలీసులు ముంబైకి పంపించారు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందా ? అని కనుక్కోవడానికి కారు చిప్‌ను డీకోడ్ చేసేందుకు జర్మనీకి పంపించారు. కేవలం 9 నిముషాల్లో కారు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయ్యింది. అంటే కారు గంటకు దాదాపు 180 నుంచి 190 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు నిర్థారించారు. అతివేగంతో పాటు సీటు బెల్ట్ వేసుకోకపోవడం ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
కాగా ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న కారు CCTV కెమరాల్లో రికార్డయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్ర పల్ఘర్ పోలీసులు ఈ ఫూటేజీని స్వాధీనం చేసుకుని, ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.21 గం.ల ప్రాంతంలో కారు ముంబై – అహ్మదాబాద్ హైవే మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి.
#cctv of the high-end car in which Cyrus Mistry was travelling
Before accident#CyrusMistryDeath #CyrusMistryAccident #TataSons #Palghar@DGPMaharashtra pic.twitter.com/uS0cuucXiu
— Indrajeet chaubey (@indrajeet8080) September 5, 2022
ప్రమాదం జరిగిన సమయంలో సైరస్ మిస్త్రీ స్నేహితురాలు, ముంబైకి చెందిన గైనకాలజిస్ట్ అనహితా పండోల్ కారును నడుపుతున్నారు. ఆమెతో పాటు ఆమె భర్త ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..