Caught on camera – Rash driving: చేతిలో స్టిరింగ్ ఉంటే.. చాలా మంది రోడ్డుపై రయ్.. రయ్ మంటూ దూసుకెళ్తుంటారు. ముందు, వెనుక ఆలోచించకుండా.. ర్యాష్ డ్రైవింగ్‌తో రోడ్డుపై భయభ్రాంతులకు గురిచేస్తుంటారు. అయితే.. ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదమని తెలిసినా.. అస్సలు పట్టించుకోని వారికి ఈ వీడియో ఆలోచించేలా చేస్తోంది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని మార్తండం వంతెనపై జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేగంగా వెళుతున్న మహింద్రా జైలో కారు ర్యాష్ డ్రైవింగ్‌తో ఒక్కసారిగా పల్టీలు కొట్టింది.
వంతెనపై వాహనాలు వెళుతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ ఉన్నప్పటికీ.. ఎదురుగా ఉన్న వాహనాన్ని ఓవర్‌టెక్ చేసి దూసుకువచ్చిన మహీంద్రా జైలో కారు.. అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ సంఘటన అంతా వెనుక ఉన్న వాహనం కెమెరాలో రికార్డయింది. ప్రమాదకరంగా బ్రిడ్జి రెయిలింగ్‌కు ఢికొట్టి కారు పల్టీలు కొడుతుంది. అదృష్టం ఏమిటంటే.. వాహనం కిందపడలేదు. దీంతో వాహనంలో ఉన్న వారికి తీవ్రగాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.
Also Read: