కారెత్తుకెళ్లిన దొంగలు మనసు మార్చుకున్నారు…!

|

Oct 13, 2020 | 1:07 PM

గుర్తు తెలియని కొందరు వ్యక్తలు అద్దాలు పగలగొట్టి మరీ కారు ఎత్తుకెళ్లారు. అలా చోరీ చేసిన కారులోంచి అరలక్ష రూపాయల విలువైన సామాగ్రిని దోచుకున్నారు.. ఆ తర్వాత పోలీసులు ఎలాగైనా పట్టుకుంటారన్న భయం వల్లో..,

కారెత్తుకెళ్లిన దొంగలు మనసు మార్చుకున్నారు...!
Follow us on

గుర్తు తెలియని కొందరు వ్యక్తలు అద్దాలు పగలగొట్టి మరీ కారు ఎత్తుకెళ్లారు. అలా చోరీ చేసిన కారులోంచి అరలక్ష రూపాయల విలువైన సామాగ్రిని దోచుకున్నారు.. ఆ తర్వాత పోలీసులు ఎలాగైనా పట్టుకుంటారన్న భయం వల్లో, కారు యజమాని మీద జాలి వల్లో కారును వదిలేసి వెళ్లారు.. పైగా అందులో కారును యజమానికి అందచేయండి అంటూ రిక్వెస్ట్‌తో కూడిన ఓ ఉత్తరం కూడా పెట్టారు.. యజమాని వివరాలను ఆ లేఖలో పొందుపరిచారు. ఈ ఘటన జరిగింది మహారాష్ట్రలోని భీమా కొరేగావ్‌లో.. ! అసలేం జరిగిందంటే.. పూణెకు చెందిన విజయ్‌ గవానేకు ట్రావెల్‌ ఏజెన్సీ ఉంది.. మొన్నీమధ్య ఆయన డ్రైవర్‌ ఒకరు కారును తీసుకెళ్లి భీమా కొరేగావ్‌లోని ఇంటి ముందు పార్క్‌ చేశాడు.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలు ధ్వంసం చేసి కారుతో పరారయ్యారు.. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.. పోలీసుకు దొరకకుండా ఉండేందుకు కారులో ఉన్న జీపీఎస్‌ వ్యవస్థను కూడా ఆపేశారు తెలివైన దొంగలు.. మళ్లీ ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ.. దొంగతనం చేసిన కారును అహ్మద్‌నగర్‌లో వదిలేసి వెళ్లారు.. కారులో దొంగలు వదిలివెళ్లిన లేఖను చూసిన పోలీసులు యజమానికి సమాచారం అందించారు.. విలువైన సామాగ్రి పోతే పోయింది కానీ కారు అయితే దొరికింది చాలనుకుంటున్నాడు యజమాని!