గుడ్‌న్యూస్..కారు లేదా బైక్ కొనాల‌నుకుంటున్నారా..? అయితే, ఇది తెలుసుకోండి..

|

Jul 28, 2020 | 7:18 PM

కారు లేదా బైక్ కొనాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌వారికి నిజంగా ఇది గుడ్‌న్యూస్ అని చెప్పవ‌చ్చు. ఎందుకంటే, కార్లు, టూవీలర్ల ధరలు భారీగా దిగిరానున్నాయి....

గుడ్‌న్యూస్..కారు లేదా బైక్ కొనాల‌నుకుంటున్నారా..? అయితే, ఇది తెలుసుకోండి..
Follow us on

కారు లేదా బైక్ కొనాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌వారికి నిజంగా ఇది గుడ్‌న్యూస్ అని చెప్పవ‌చ్చు. ఎందుకంటే,
కార్లు, టూవీలర్ల ధరలు భారీగా దిగిరానున్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ తాజా నిర్ణయంతో క‌స్ట‌మ‌ర్ల‌కు భారీ ఊర‌ట ల‌భించ‌నుంది.

ఆగ‌స్టు 1 నుంచి కొత్త‌గా కొనుగోలు చేసే బైకులు, కార్ల ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి. వీటి కొనుగోలు స‌మ‌యంలో చెల్లించాల్సిన ఇన్సూరెన్స్‌ను ఇక ఏడాది వ‌ర‌కు మాత్ర‌మే చెల్లించాల్సి ఉంటుంది. దీర్ఘ‌కాలిక ఇన్సూరెన్స్ ప్యాకేజీల‌ను తొల‌గిస్తున్న‌ట్లు ఐఆర్‌డీఏఐ తెలిపింది. క‌రోనా స‌మ‌యంలో వాహ‌న విక్ర‌యాలు ప‌డిపోతున్న నేప‌థ్యంలో ఐఆర్‌డీఏఐ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో సేల్స్ పెరుగుతాయ‌ని వాహ‌న డీల‌ర్లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌పోతే, ఇన్సూరెన్స్ ప్రీమియం విషయానికి వస్తే.. టూవీలర్లకు రూ.8,000 దాకా, కార్లకు రూ.40,000 దాకా భారం భరించాల్సి వస్తోంది. ఆగస్టు 1 తర్వాత ఆ భారం తగ్గిపోనుంది.