G20 Summit 2023: జీ 20 సదస్సులో ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను తిరస్కరించిన ట్రూడో.. అసలు కారణం అదేనంటోన్న ఇంటెలిజెన్స్ వర్గాలు

|

Sep 22, 2023 | 12:30 PM

న్యూఢిల్లీలో సెప్టెంబర్‌ నెల ఆరాంభంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన జీ 20 సదస్సు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకతను సంతరించుకుంది. వివిధ దేశాలకు చెందిన అధినేతలు, ప్రధానులు, ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. జీ20 సమ్మిట్ కోసం ఢిల్లీకి చేరుకున్న అన్ని దేశాధినేతలు, ప్రతినిధుల కోసం ప్రభుత్వం వీవీఐపీ హోటళ్లను బుక్ చేసింది. దాదాపు 30 హోటళ్లలో వీరంతా బస చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఐటీసీ మౌర్య షెరటన్‌లో, చైనా ప్రధాని లీ కియాంగ్ తాజ్ ప్యాలెస్‌లో బస చేశారు. ఢిల్లీ పోలీసులతోపాటు కేంద్ర పారామిలటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జీ కమండోలు..

G20 Summit 2023: జీ 20 సదస్సులో ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను తిరస్కరించిన ట్రూడో.. అసలు కారణం అదేనంటోన్న ఇంటెలిజెన్స్ వర్గాలు
Canadian PM Justin Trudeau
Follow us on

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 22: న్యూఢిల్లీలో సెప్టెంబర్‌ నెలారాంభంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన జీ 20 సదస్సు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకతను సంతరించుకుంది. వివిధ దేశాలకు చెందిన అధినేతలు, ప్రధానులు, ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. జీ20 సమ్మిట్ కోసం ఢిల్లీకి చేరుకున్న అన్ని దేశాధినేతలు, ప్రతినిధుల కోసం ప్రభుత్వం వీవీఐపీ హోటళ్లను బుక్ చేసింది. దాదాపు 30 హోటళ్లలో వీరంతా బస చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఐటీసీ మౌర్య షెరటన్‌లో, చైనా ప్రధాని లీ కియాంగ్ తాజ్ ప్యాలెస్‌లో బస చేశారు. ఢిల్లీ పోలీసులతోపాటు కేంద్ర పారామిలటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జీ కమండోలు వివిధ భద్రతా ఏజన్సీలు అన్ని ప్రెసిడెన్షియల్ సూట్ రక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గ్రేటర్ నోయిడాలోని వీఐపీ సెక్యూరిటీ ట్రైనింగ్ సెంటర్‌లో ప్రోటోకాల్‌లపై శిక్షణ తీసుకున్న వెయ్యి మంది సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాన్ని కూడా సీఆర్పీఎఫ్ ఏర్పాటు చేసింది. అయితే జీ 20 సదస్సుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించారు. అన్ని దేశాలతోపాటు కెనడా ప్రధాని జస్టిన్‌ జూడో కూడా జీ 20 సదస్సుకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఆయన జీ–20 సదస్సుకు వచ్చినప్పుడు కాస్త భిన్నంగా ప్రవర్తించారట. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి.

వివిధ దేశాల అధినేతల కోసం కేంద్ర ప్రభుత్వం హోటల్స్‌లో భారీ భద్రత ఏర్పాట్లు చేసి ప్రెసిడెన్షియల్‌ సూట్‌లను సిద్ధం చేసిన సంగతి. ఈ ఏర్పాట్లను ప్రధాని మోదీ దగ్గరుంచి మరీ పరిశీలించారు. భారత్‌కు విచ్చేసిన దేశాధినేతలందరూ తమకు కేటాయించిన హోటళ్లలో బస చేశారు. అలాగే కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కోసం న్యూఢిల్లీలోని హోటల్‌ లలిత్‌ హోటల్‌లో ప్రెసిడెన్షియల్‌ సూట్‌ ఏర్పాటు చేశారు. అయితే ట్రూడో దానిని తిరస్కరించి అదే హోటల్‌లో సాధారణ గదిలో బస చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రిజర్వ్‌ చేసిన ప్రెసిడెన్షియల్‌ సట్‌లో ఒక్క రోజు కూడా బస చేయలేదట. ప్రెసిడెన్షియల్ సూట్‌ను తిరస్కరించాలన్న ట్రూడో నిర్ణయంపై భారత ఇంటెలిజెన్స్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో వాస్తవానికి భారత్‌లో సెప్టెంబర్‌ 8, 9, 10 తేదీల్లో మూడు రోజుల పాటు జీ20 సదస్సులో పాల్గొనేందకు భారత్‌లో ఉండాల్సింది. అయితే ట్రూడో విమానం సెప్టెంబర్‌ 10న కెనడాకు బయల్దేరే ముందు సాంకేతిక సమస్య కారణంగా బ్రేక్‌డైన్‌ ఇచ్చింది. భారత్‌ ఎయిర్‌ ఇండియా వన్‌ విమానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినా ట్రూడో తిరస్కరించారు. దీంతో ఆయన బస మరోరెండు రోజులు పొడిగించవల్సి వచ్చింది. కెనడా నుంచి మరో విమానం వచ్చేంత వరకూ ఆయన భారత్‌లోనే ఉన్నారు. ఇదంతా ట్రూడో తన భద్రతాధికారుల సూచన మేరకే చేసినట్టుగా తెలుస్తోంది. ఖలిస్తాన్‌ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ప్రమేయం ఉందని కెనడా అభాండాలు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రూడో ఇలా ప్రవర్తించి ఉంటారని భావిస్తున్నారు. కెనడా నుంచి మరో విమానం రావడంతో రెండు రోజుల తర్వాత సెప్టెంబర్‌ 12న ఆయన తిరిగి కెనడాకు బయల్దేరి వెళ్లారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.