జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో కాశ్మీరీ, డోంగ్రీ, హిందీ భాషలను అధికార భాషలుగా చేరుస్తూ కేంద్ర కేబినెట్ బిల్లును ఆమోదించింది. ఇప్పటికే అక్కడ ఉర్దూ, ఇంగ్లీషు భాషలు అధికార భాషలుగా ఉన్నాయి. అయితే కాశ్మీరీ, డోంగ్రీ, హిందీ భాషలను అధికార భాషలుగా చేయాలనీ ఎప్పటి నుంచో అక్కడ డిమాండ్ ఉందని మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. తాజాగా ఈ బిల్లును రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని ఆయన వెల్లడించారు.