Train Accident : మరో రైలు ప్రమాదం.. రెండు భాగాలుగా విడిపోయిన మగద్‌ ఎక్స్‌ప్రెస్‌.. భయాందోళనలో ప్రయాణికులు

|

Sep 08, 2024 | 2:12 PM

ఇంజన్ ముందు బోగీలను మోస్తూ చాలా దూరం వెళ్లింది. ఇంజన్ లేకుండా అరకిలోమీటర్ మేర ట్రాక్‌పై పరిగెత్తడంతో వెనుక బోగీలు ఆగిపోయాయి. దీంతో రైలులో కూర్చున్న ప్రయాణికుల్లో అరుపులు కేకలు వినిపించాయి. సమీపంలో రైల్వే క్రాసింగ్ ఉండడంతో పెద్ద సంఖ్యలో జనం కూడా అక్కడికి చేరుకున్నారు.

Train Accident : మరో రైలు ప్రమాదం.. రెండు భాగాలుగా విడిపోయిన మగద్‌ ఎక్స్‌ప్రెస్‌.. భయాందోళనలో ప్రయాణికులు
Train Accident
Follow us on

Train Accident : బీహార్‌లోని బక్సర్‌లో ఘోర రైలుప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి ఇస్లాంపూర్ వెళ్తున్న మగద్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. రఘునాథ్‌పూర్‌, తుడిగంజ్‌ స్టేషన్ల మధ్య అకస్మాత్తుగా కప్లింగ్‌ తెగిపోవడంతో రైలు రెండు భాగాలుగా విడిపోయింది. దీని కారణంగా ఇంజిన్ వెనుక ఉన్న కొన్ని కోచ్‌లు మినహా మిగిలిన కోచ్‌ల కంటే చాలా ముందుకు వెళ్లింది. అయితే విషయం తెలుసుకున్న లోకో పైలట్ రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం పలువురు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని లోపాలను సరిచేసి రైలును ముందుకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బక్సర్-డిడియు పాట్నా రైల్వే సెక్షన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో డౌన్ మగద్ ఎక్స్‌ప్రెస్ రఘునాథ్‌పూర్ స్టేషన్ నుండి తుడిగంజ్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. అయితే, ఈ రైలు తదుపరి స్టేషన్‌ పాట్నా. కాగా, ప్రమాదం తర్వాత బోగీలు వదిలి వెళ్లిన ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. ఈ బోగీలు ట్రాక్‌పై కొంత దూరం పరుగెత్తిన తర్వాత సురక్షితంగా ఆగిపోవడం విశేషం.

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రైలు నంబర్ 20802 డౌన్ మగద్ ఎక్స్‌ప్రెస్.. సరిగ్గా ఉదయం 11 గంటలకు 8 నిమిషాల ఆలస్యంతో డుమ్రాన్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. ఈ రైలు స్టార్ట్ అయిన వెంటనే నిమిషం వ్యవధిలో ఈ ప్రమాదం జరిగింది. ఇంజన్ ముందు బోగీలను మోస్తూ చాలా దూరం వెళ్లింది. ఇంజన్ లేకుండా అరకిలోమీటర్ మేర ట్రాక్‌పై పరిగెత్తడంతో వెనుక బోగీలు ఆగిపోయాయి. దీంతో రైలులో కూర్చున్న ప్రయాణికుల్లో అరుపులు కేకలు వినిపించాయి. సమీపంలో రైల్వే క్రాసింగ్ ఉండడంతో పెద్ద సంఖ్యలో జనం కూడా అక్కడికి చేరుకున్నారు.

ఈ ప్రమాదంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసుల సహాయంతో ప్రయాణికుల్లో భయాందోళన తొలగించారు. రైల్వే ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని కప్లింగ్ మరమ్మతు పనులను ప్రారంభించారు. మరోవైపు, ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రమాదంపై విచారణ చేపట్టాలని డివిజనల్ రైల్వే సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..