Bullet train to link Delhi and Ayodhya భారత్‌లో మరో మార్గంలో బుల్లెట్ ట్రైన్ పరుగుపెట్టనుంది. ఇప్పటికే కేంద్ర సర్కారు అహ్మదాబాద్ – ముంబైల మధ్య బుల్లెట్ ట్రైన్ పరుగుపెట్టించేందుకు పనులను షురూ చేసింది. ప్రస్తుత సమాచారం ప్రకారం మరో మార్గంలోనూ బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని నిర్మించేందుకు కేంద్రం యోచిస్తోంది.
కేంద్రం ఢిల్లీ నుంచి వారణాసి కారిడార్ పేరుతో నూతన బుల్లెట్ ట్రైన్ రూట్‌ను ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఈ కారిడార్ దాదాపు 800 కిలో మీటర్లు పొడవు ఉండనుంది. ఢిల్లీ నుంచి మధుర, ప్రయాగ్‌రాజ్, వారణాసి, ఆగ్రా, కాన్పూర్, జెవర్ ఎయిర్‌పోర్టులను కలుపుతూ వెళ్లనుంది. అంతేకాకుండా ఈ ట్రైన్ లక్నో, రాయబరేలీ తాకుతూ వెళ్లనుంది.
ఢిల్లీ వారణాసి బుల్లెట్ ట్రైన్ పనులకు సంబంధించిన సర్వేను రాడార్ ద్వారా నిర్వహించనున్నట్లు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు. సాధారణ విధానం అయితే సర్వే పూర్తి అవ్వడానికి 12 నెలలు పడుతుందని, రాడార్ ద్వారా సర్వే చేపడితే 12 రోజుల్లో పూర్తి చేయవచ్చని వివరించారు. ఇప్పటికే అహ్మదాబాద్ – ముంబై బుల్లెట్ ట్రైన్ మార్గానికి రాడార్ సర్వేనే నిర్వహించినట్లు తెలిపారు. జీపీఎస్, లేజర్ డాటా, ఫోటోలు, రాడార్ అందించిన సమాచారం ప్రకారం సర్వేను పూర్తి చేస్తామని తెలిపారు. కాగా, ఈ బుల్లెట్ ట్రైన్ పరుగుపెట్టాలంటే మాత్రం కొద్ది కాలం ఆగాలని ఎన్‌హెచ్ఎస్ఆర్ఎల్ ప్రతినిధిలు అంటున్నారు.
కాగా, ముంబై – హైదరాబాద్ మధ్య కూడా బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని నిర్మించే ఆలోచనలో కేంద్ర సర్కారు ఉంది. ఈ నగరాలే కాకుండా మరిన్ని నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ మార్గాలను నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది.