యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై బీఎస్పీ చీఫ్ మాయావతి ఫైర్

| Edited By: Pardhasaradhi Peri

Oct 01, 2020 | 10:23 PM

హత్రాస్, బలరాం పూర్ ఘటనలపై స్పందించిన  బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి..యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. యోగి రాజీనామా చేయాలనీ లేదా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని..

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై బీఎస్పీ చీఫ్ మాయావతి ఫైర్
Follow us on

హత్రాస్, బలరాం పూర్ ఘటనలపై స్పందించిన  బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి..యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. యోగి రాజీనామా చేయాలనీ లేదా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. హత్రాస్, బలరాం పూర్ జిల్లా ఘటనలు 2012 లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను గుర్తుకు తెస్తున్నాయని మాయావతి పేర్కొన్నారు. ఈ ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే హక్కు లేదన్నారు. ఇటీవలి కాలంలో మహిళలపై, బాలికలపై ఈ రాష్ట్రంలో పాశవిక నేరాలు పెరిగాయని ఆమె నిప్పులు కక్కారు.