పాకిస్థాన్‌లో బందీగా ఉన్న జవాన్‌ విడుదల కోసం భారత్‌ చర్చలు! ఒక వేళ వదిలిపెట్టకుంటే..

ఫిరోజ్‌పూర్ సరిహద్దులో విధుల్లో ఉన్న బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ పీకే సింగ్, నీడ కోసం ముందుకు వెళ్ళి పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించాడు. పాకిస్తాన్ రేంజర్లు అతన్ని అరెస్ట్ చేశారు. పహల్గాం దాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత ప్రభుత్వం సింగ్ విడుదలకు పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతోంది.

పాకిస్థాన్‌లో బందీగా ఉన్న జవాన్‌ విడుదల కోసం భారత్‌ చర్చలు! ఒక వేళ వదిలిపెట్టకుంటే..
Bsf Jawan

Updated on: Apr 25, 2025 | 11:34 AM

ఫిరోజ్‌పూర్ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ 182వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ పీకే సింగ్.. స్థానికంగా రైతుల పంటకు భద్రతగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎండ వేడిమిని తట్టుకోలేక చెట్టు నీడ కోసం కొద్దిగా ముందుకు వెళ్లాడు. అయితే అది సరిహద్దును దాటి పాక్ భూభాగంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో అటు వైపు గస్తీ కాస్తున్న పాక్ రేంజర్లు కాస్తా.. పీకే సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ సమాచారాన్ని పాక్ రేంజర్లు.. భారత సైన్యానికి అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు చర్యలు చేపట్టారు.

అయితే ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య పీకే సింగ్.. పాక్ భూభాగంలో అడుగుపెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం భారత అధికారులు బీఎస్ఎఫ్ జవాన్‌‍ను విడిపించేందుకు పాక్ అధికారులు చర్చలు జరుపుతున్నారు. మరి ఈ చర్చలు సఫలం అవుతాయో, విఫలం అవుతాయో చూడాలి. ఒక వేళ జవాన్‌ విడుదలకు పాక్‌ ఒప్పుకోకపోతే.. భారత ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..