హత్రాస్ కేసులో అలహాబాద్ హైకోర్టు స్పందించింది. యూపీకి చెందిన పోలీసు ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 12 న తమ ముందు హాజరు కావాలని వారిని ఆదేశించింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం కావడంతోను, యూపీ పోలీసుల తీరు ఉదాసీనంగా ఉండడంతోను అలహాబాద్ హైకోర్టు ఈ చర్య తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ రూలింగ్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.