బ్రేకింగ్: ఇకపై 28 రాష్ట్రాలే

| Edited By: Pardhasaradhi Peri

Aug 05, 2019 | 1:33 PM

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు భాగాలుగా కేంద్రం విభజన చేసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ము-కశ్మీర్ ఏర్పడగా.. అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది. దీంతో దేశంలో రాష్ట్రాల సంఖ్య 29 నుంచి 28కు తగ్గిగా.. కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 9కు చేరింది. కాగా జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370రద్దు, 35ఏ రద్దు, రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలపై అమిత్ షా […]

బ్రేకింగ్: ఇకపై 28 రాష్ట్రాలే
Follow us on

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు భాగాలుగా కేంద్రం విభజన చేసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ము-కశ్మీర్ ఏర్పడగా.. అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది. దీంతో దేశంలో రాష్ట్రాల సంఖ్య 29 నుంచి 28కు తగ్గిగా.. కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 9కు చేరింది. కాగా జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370రద్దు, 35ఏ రద్దు, రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలపై అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. ఆ వెంటనే దీనికి సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం నుంచి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం తెలిసిందే.