మైనింగ్‌ కంపెనీలో పేలుడు.. ఏడుగురికి గాయాలు..!

| Edited By: Pardhasaradhi Peri

May 07, 2020 | 7:52 PM

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. కడలూర్ కోల్ మైనింగ్ కంపెనీలో పేలుడు సంభవించింది. నైవేలీ లింగ్టైన్ కార్పొరేషన్ ప్లాంట్‌లోని బాయిలర్‌ పేలడంతో.. ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి ఫైర్‌ సిబ్బంది పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తమిళనాడులో జరిగిన పేలుడు ఘటనతో ఇవాళ మొత్తం మూడు సంఘటనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత […]

మైనింగ్‌ కంపెనీలో పేలుడు.. ఏడుగురికి గాయాలు..!
Follow us on

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. కడలూర్ కోల్ మైనింగ్ కంపెనీలో పేలుడు సంభవించింది. నైవేలీ లింగ్టైన్ కార్పొరేషన్ ప్లాంట్‌లోని బాయిలర్‌ పేలడంతో.. ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి ఫైర్‌ సిబ్బంది పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. తమిళనాడులో జరిగిన పేలుడు ఘటనతో ఇవాళ మొత్తం మూడు సంఘటనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత ఏపీలోని విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇక మరో ఘటనలో చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాయ్‌గఢ్‌లోని స్థానిక పేపర్ మిల్లులో గ్యాస్ లీకేజ్ కావడతో ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో కెమికల్ కంపెనీల సమీపంలో ఉన్న ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.