దారుణం.. అనుమానంతో ఐదుగురిని కొట్టి చంపిన గ్రామస్తులు.. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పోలీస్!

| Edited By: Balaraju Goud

Sep 15, 2024 | 6:48 PM

ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఓ కుటుంబంపై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టి చంపేశారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలతో సహా ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు.

దారుణం.. అనుమానంతో ఐదుగురిని కొట్టి చంపిన గ్రామస్తులు.. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పోలీస్!
Witchcraft
Follow us on

ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఓ కుటుంబంపై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టి చంపేశారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలతో సహా ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు.

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ చేతబడి వంటి మూఢనమ్మకాలు ఇంకా తొలగిపోలేదు. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లో క్షుద్ర పూజల పేరుతో ఎంతోమంది బలవుతున్నారు. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్తులు మూకుమ్మడిగా ఓకుటుంబంపై దాడి చేశారు. విచక్షణ కోల్పోయి.. ఐదుగురిని కర్రలతో అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. మృతులు ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈదారుణ ఘటన ఛత్తీస్‌గఢ్ లోని లోని సుక్మా జిల్లాలో చోటుచేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారే. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆకుంటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు.

సుక్మా జిల్లాలోని కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎట్కల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. హత్య చేసిన తర్వాత కుంట పోలీస్ స్టేషన్‌లో ఐదుగురు గ్రామస్తులు లొంగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ కిరణ్ చౌహాన్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసును ఛాలెంజ్‌గా తీసుకుని దారుణానికి పాల్పడ్డ మరికొందరి కోసం పోలీసు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అయితే గత కొంత కాలంగా హెడ్‌ కానిస్టేబుల్ బుచ్చ కుటుంబం చేతబడి చేస్తున్నారని.. అందుకే గ్రామస్తులు ఒక్కొక్కరిగా అనారోగ్యానికి గురై మరణిస్తున్నారంటూ గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చేతబడి వల్ల గ్రామంలో ఒక్కొక్కరు చనిపోతున్నారనే అనుమానంతో ఈ హత్యలు జరిగాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..