Mamata Banerjee: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక.. మీ వాళ్లే మీ మాట వినలేదంటూ మమతపై BJP సెటైర్లు

రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నిక కావడం రాజకీయంగా తృణముల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బగా ప్రచారం జరుగుతోంది. తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటమే దీనికి కారణం.

Mamata Banerjee: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక.. మీ వాళ్లే మీ మాట వినలేదంటూ మమతపై BJP సెటైర్లు
Mamata Banerjee

Updated on: Jul 22, 2022 | 11:19 AM

Presidential Elections 2022: గిరిజన మహిళ ద్రౌపది ముర్ము (Draupadi Murmu) చరిత్ర సృష్టించారు. దేశ తొలి గిరిజన రాష్ట్రపతిగా, రెండో మహిళా రాష్ట్రపతిగా ఆమె అరుదైన గుర్తింపు సాధించారు. రాష్ట్రపతి ఎన్నిక్లలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యస్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నిక కావడం రాజకీయంగా తృణముల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బగా ప్రచారం జరుగుతోంది. తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటమే దీనికి కారణం. టీఎంసీ ఎంపీ, ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌ను కారణంగా చూపుతూ బీజేపీ నేత అమిత్ మాల్వియా.. మమతా బెనర్జీపై సెటైర్లు వేశారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్ చేశారని మాల్వియా ట్వీట్ చేశారు. అలాగే ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేల ఓట్ల చెల్లనివిగా ప్రకటించారని గుర్తుచేశారు. విపక్షాల మధ్య ఐక్యత తీసుకొస్తానని చెప్పే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాటను.. సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలే ధిక్కరించారని అన్నారు. అదే సమయంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని బెదిరింపులకు పాల్పడినా.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలందరూ ద్రౌపది ముర్ముకే ఓటు వేశారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకి మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. దేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలను ముర్ము పరిరక్షించాలని యావత్ దేశం కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షకురాలిగా ముర్ము ఉండాలని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..