Bharatiya Janata Party: భారతీయ జనతా పార్టీ తమ ఎంపీలకు బుధవారం విప్ జారీ చేసింది. మీరంతా ఈ రోజు జరిగే లోక్‌సభ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరుకావాలని.. ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని పార్టీ అదిష్టానం ఆదేశించింది. ఈ మేరకు బీజేపీ.. తమ పార్టీ ఎంపీలకు మూడు లైన్లతో విప్‌ను జారీచేసింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగిన అనంతరం ఈ రోజు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు మద్దతుగా ఎంపీలందరూ సభలో ఉండాలంటూ అధిష్ఠానం ఈ విప్‌ను జారీ చేసి పలు సూచనలు చేసింది. ఎంపీలంతా అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చింది. అయితే ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ప్రసంగించనున్నారు.