ఉత్తర ప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల గెలుపుతో దూకుడు మీదున్న భారతీయ జనతా పార్టీ(BJP).. తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గెలుపు వ్యూహాలు రచిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఫార్ములా అనుసరిస్తూ.. అవసరమైతే.. అంతకు మించిన అస్త్రాలు సంధించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో యుపీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ నేతలు ఏపీలో అనుసరించాల్సిన వ్యూహాలు రచిస్తున్నారు. యూపీ ఎన్నికల్లో ఇంఛార్జిగా కీలక పాత్ర పోషించిన సత్యకుమార్ సూచనలు ఏపీలో రాబోయే ఎన్నికలకు కావాలన్నారు. యుపీలో అభివృద్ధే మళ్లీ బీజేపీని గెలిపించిందన్న సత్య కుమార్.. రెండోసారి యోగి గెలుపు అనేక రికార్డులను తిరిగరాసిందన్నారు.
మోదీ, యోగి కలిస్తే.. రెండు అనుకున్నారు కాని.. అక్కడ 11 అయ్యిందన్నారు. ఏపీకి కేంద్రం నుంచి అనేక నిధులు వస్తున్నాయన్న సత్య కుమార్..పరిపాలన వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు కాదు.. పంచాయతీలకు నిధులు వెళ్లాలన్నారు. విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలను కేంద్రం పూర్తి చేసిందన్న అన్న ఆయన అభివృద్ధి విషయంలో కేంద్రం వివక్ష చూపదున్నారు.
అమరావతి నుంచి రాజధానిని కదలించలేరని స్పష్టం చేశారు. అమరావతిలో అన్ని సంస్థలు త్వరగా పనులు ప్రారంభించేలా చూస్తామన్న సత్య కుమార్.. అవసరం అయితే ప్రతి 15 రోజులకు కేంద్రంలో పెద్దలను కలిసి విన్నవిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి: Yogi Adityanath Oath: రెండోసారి ఉత్తర ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యానాథ్.. కొత్త మంత్రి వర్గంలో మంత్రులు వీరే..