ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజోయ్ కుమార్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది కాస్తా ద్రౌపది ముర్ము స్వగ్రామం నుంచి ఒడిశా అసెంబ్లీ వరకు నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందే అంశంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య అసెంబ్లీలో గురువారం మాటల యుద్ధం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల గందరగోళం కారణంగా ఓలా స్పీకర్ బిక్రమ్ కేశరీ అరుఖ్ సభను ఉదయం 11.30 గంటలకు వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల సమయం 7 నిమిషాలు మాత్రమే కొనసాగింది. జీరో అవర్‌లో కూడా బీజేపీ సభ్యులు స్పీకర్ ముందు నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ సభను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయం కోసం సభ సమావేశం కాగానే బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి పరస్పరం నినాదాలు చేసుకున్నారు.
రాష్ట్రపతి అభ్యర్థిపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి అజోయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని ప్రతిపక్ష చిప్ విప్ మోహన్ మాఝీ అన్నారు. ఒడిశాకు చెందిన ఒక గిరిజన మహిళ భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ తప్పుపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అణగారిన, వెనుకబడిన తరగతుల అభివృద్ధికి కృషి చేస్తుంటే.. కాంగ్రెస్ నాయకులకు నచ్చడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ వారి పాలనలో గిరిజన, వెనుకబడిన తరగతులను విస్మరించిందని మాఝీ విమర్శించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడియా గిరిజన మహిళను ప్రతిపాదించడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.