సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు సరికాదు, ముంబై పోలీసులు

| Edited By: Anil kumar poka

Aug 09, 2020 | 10:01 AM

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సీబీఐ దర్యాప్తు సరికాదని ముంబై పోలీసులు అంటున్నారు. ఈ కేసును తాము నిష్పాక్షికంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని, ఇక సీబీఐ దర్యాప్తు అనవసరమన్న తీరులో వారు సుప్రీంకోర్టుకు ఓ అఫిడవిట్ దాఖలు చేశారు.

సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు సరికాదు, ముంబై పోలీసులు
Follow us on

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సీబీఐ దర్యాప్తు సరికాదని ముంబై పోలీసులు అంటున్నారు. ఈ కేసును తాము నిష్పాక్షికంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని, ఇక సీబీఐ దర్యాప్తు అనవసరమన్న తీరులో వారు సుప్రీంకోర్టుకు ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. బీహార్ పోలీసుల దర్యాప్తు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని, ఫెడరలిజం సూత్రాలకు విరుధ్ధమని విమర్శించారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని, అయితే డిప్రెషన్ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాడా లేక బాలీవుడ్ లో తన శత్రువుల వల్లనా అన్నది తమ దర్యాప్తులో తేలవలసిఉందన్నారు. అసలు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతను సీబీఐ స్వీకరించేముందు సుప్రీంకోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాల్సివుందన్నారు.

సుశాంత్ కేసులో ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసే అధికారం గానీ, సాక్షులను విచారించే అధికారం గానీ బీహార్ పోలీసులకు లేదని ముంబై పోలీసులు స్పష్టం చేశారు. అలాగే దీన్ని సీబీఐ కి ట్రాన్స్ ఫర్ చేసే పవర్ కూడా లేదన్నారు. బీహార్ పోలీసు అధికారిని క్వారంటైన్ చేయడం దర్యాప్తును అడ్డుకోవడమే అనే ఆరోపణను ముంబై ఖాకీలుకొట్టిపారేశారు.