Bihar CM vs Speaker: మిస్టర్ కూల్‌కు కోపం.. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్‌పై సీఎం ఫైర్..రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని హితవు!

రాజ్యసభ, లోక్‌సభ లేదా రాష్ట్ర శాసనసభలు కావచ్చు. అధికార పార్టీలు మరియు ప్రతిపక్షాలు ఒకరినొకరు లక్ష్యంగా చేసుకోవడం తరచుగా కనిపిస్తుంది. కానీ స్పీకర్ విషయానికి వస్తే అందరూ గౌరవిస్తారు. అయితే, బీహార్ అసెంబ్లీ విభిన్న ఘటన చోటుచేసుకుంది

Bihar CM vs Speaker: మిస్టర్ కూల్‌కు కోపం.. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్‌పై సీఎం ఫైర్..రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని హితవు!
Bihar Cm Vs Speaker
Follow us

|

Updated on: Mar 14, 2022 | 9:03 PM

Bihar Assembly Meet: మిస్టర్‌ కూల్‌గా పేరున్న బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌(Nitish Kumar)కు కోపం వచ్చింది. సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్‌ విజయ్‌కుమార్‌ సిన్హా(Vijay Kumar Sinha) పై ఆయన విరుచుకుపడడం సంచలనం రేపింది. గతంలో ఎన్నడు లేని విధంగా అసెంబ్లీలో సీఎం వర్సెస్‌ స్పీకర్‌(CM vs Speaker) సీన్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని స్పీకర్‌ విజయ్‌కుమార్‌ను ఆవేశంతో కోరారు నితీష్‌ . సభను ఇలాగే నడపాలని మీరు అనుకుంటున్నారా? ఇలాగే నడపాలని అనుకుంటే మేము సభను ముందుకు సాగనీయం. చర్చలు జరగాల్సిన తీరు ఇది కాదు” అని నితీష్ వ్యాఖ్యానించారు.

రాజ్యసభ, లోక్‌సభ లేదా రాష్ట్ర శాసనసభలు కావచ్చు. అధికార పార్టీలు మరియు ప్రతిపక్షాలు ఒకరినొకరు లక్ష్యంగా చేసుకోవడం తరచుగా కనిపిస్తుంది. కానీ స్పీకర్ విషయానికి వస్తే అందరూ గౌరవిస్తారు. అయితే, బీహార్ అసెంబ్లీ విభిన్న ఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీలో స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మండిపడ్డారు. తన నియోజకవర్గంలో పోలీసుల తీరు బాగాలేదని స్పీకర్‌ విజయ్‌కుమార్‌ సభలో ప్రస్తావించడం ఈ వివాదానికి కారణమయ్యింది. ప్రతిసారి ఇదే విషయాన్ని ఎందుకు రిపీట్‌ చేస్తున్నారని స్పీకర్‌ను ప్రశ్నించారు నితీష్‌కుమార్‌. అసెంబ్లీలో ప్రతి సభ్యుడు తన నియోజకవర్గం సమస్యలను ప్రస్తావించవచ్చని, తన నియోజకవర్గం లోని సమస్యను మాత్రమే లేవనెత్తినట్టు స్పీకర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. అయితే పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారని , వారి పనిలో ఎవరి జోక్యం ఉండదన్నారు నితీష్‌. విచారణ నివేదికను పోలీసులు కోర్టులో సమర్పిస్తారని, అసెంబ్లీలో ఫైల్ చేయరని స్పష్టం చేశారు.

ఇదిలావుంటే కొన్ని రోజుల క్రితం లఖిసరాయ్‌లో ఒక సంఘటన జరిగింది. నిషేధ చట్టాన్ని ఉల్లంఘించినందుకు గత నెలలో తన ప్రాంతంలో పలువురిని అక్రమంగా అరెస్టు చేయడంపై సిన్హా అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ మంత్రి బిజేంద్ర యాదవ్‌ను ఎలాంటి చర్యలు తీసుకున్నారో సభకు తెలియజేయాలని స్పీకర్ కోరారు. దీనిపై ముఖ్యమంత్రి నితీష్ మండిపడ్డారు. నితీష్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ ప్రభుత్వం తరపున సమాధానం చెప్పే అధికారం మంత్రికి ఉంది. విచారణ జరుగుతోందని వారు చెప్పినప్పుడు, రేపు మరుసటి రోజు కొత్త సమాధానంతో రావాలని మీరు వారిని అడగండి. ఇది నిబంధనలకు విరుద్ధం. దయచేసి రాజ్యాంగాన్ని చూడండి” అంటూ సీఎం నితీష్ కుమార్ హితవు పలికారు.

Read Also… Knowledge: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్ని మురికివాడలున్నాయో తెలుసా? వాటిల్లో ఎంత మంది నివాసం..