Nitish Kumar: ఎన్డీయేకి జేడీయూ గుడ్ బై? సోనియాను కలవనున్న నీతిష్ కుమార్.. జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం

|

Aug 08, 2022 | 11:49 AM

ఎన్డీయేకు మరోసారి గుడ్ బై చెప్పేందుకు నితీష్ రెడీ అవుతున్నారా.. బీజేపీతో బంధం తెంపుకునేందుకు సిద్ధంగా ఉన్నారా.. ఆర్డేడీ, కాంగ్రెస్ తో జతకట్టేందుకు పక్కా ప్లాన్ వేశారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కొతం కాలంగా

Nitish Kumar: ఎన్డీయేకి జేడీయూ గుడ్ బై? సోనియాను కలవనున్న నీతిష్ కుమార్.. జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం
Nitish Kumar
Follow us on

Nitish Kumar: ఎన్డీయే కూటమిలో భారీ కుదుపు.. జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగేందుకు జేడీయూ  నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  కొతం కాలంగా బీజేపీ, జేడీయూ మధ్య దూరం పెరుగుతుండగా..  ఆదివారం  ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యకతన జరిగిన నీతిఆయోగ్ సమావేశానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ గైర్హాజరు కావడంతో రెండు పార్టీల మధ్య గ్యాప్ బాగా పెరిగిందన్న ప్రచారం హస్తిన వర్గాల్లో జోరందుకుంది. ఆతర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు బీజేపీ-జేడీయూ మధ్య వ్యవహరం చెడిందని రూడీ చేస్తున్నాయి.  బీహర్ సీఎం నీతిష్ కుమార్ తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలతో.. ఎన్డీయే నుంచి జేడీయూ తప్పుకోవడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి.  ఎమ్మెల్యేలు, ఎంపీలతో మంగళవారం సమావేశమయ్యేందుకు జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. బీజేపీ-జేడీయూ మధ్య పొసగడం లేదంటూ వార్తలు వస్తున్న క్రమంలో ఈసమావేశానికి పిలుపునివ్వడం బీహార్ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందనే చర్చ నడుస్తోంది.

ఈక్రమంలోనే  కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఫోన్ లో మాట్లాడిన నితీష్ కుమార్ ఆమెను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి బీహార్ లో కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే యోచనలో నీతిష్ కుమార్ ఉన్నట్లు సమాచారం. ఆ దిశగా నీతిష్ చకచకా పావులు కదుపుతున్నారు.

మరోవైపు జేడీయూ అధినేత నితీష్ కుమార్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రామచంద్రప్రసాద్ సింగ్ (RCP SINGH) సింగ్ రెండు రోజుల కిందటే బీహార్ సీఎంపై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీనుంచి వైదొలిగారు. జులై 2022 వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో మంత్రివర్గంలో పనిచేసిన ఆర్సీపీ సింగ్ రాజ్యసభ సభ్యత్వాన్ని నితీష్ కుమార్ పునరుద్ధరించకపోవడంతో కేంద్రమంత్రి వర్గం నుంచి వైదొలగాల్సి వచ్చింది. దీంతో పార్టీకి రాజీనామా చేస్తూ జేడీయూ మునిగిపోతున్న ఓడ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆర్సీపీ సింగ్ వ్యాఖ్యలను జేడీయూ జాతీయ అధ్యక్షులు రాజీవ్ రంజన్ సింగ్ ఖండిస్తూ.. జేడీయూ మునిగిపోతున్న ఓడ కాదని..ప్రయాణించేదంటూ కౌంటర్ ఇచ్చారు. ఓడను ముంచేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని..అటువంటి వారిని గుర్తించి పార్టీ బలోపేతానికి నీతిష్ కుమార్ చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఈక్రమంలో బీజేపీ..జేడీయూని చీల్చేందుకు ప్రయత్నిస్తోందన్న వార్తలు రాజకీయ పండితుల నుంచి వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో బీజేపీకి గుడ్ బై చెప్పే యోచనలో నీతిష్ కుమార్ ఉన్నారనే వదంతులు వ్యాపిస్తున్నాయి. ఎన్డీయే లో కొనసాగాలా.. వైదొలగాలా అనే దానిపై రేపు తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..