బీహార్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని బక్సర్‌లో ఓ భర్త గర్భవతి అయిన భార్యను ఓ గదిలో బంధించాడు. అనంతరం కత్తి, స్క్రూడ్రైవర్‌తో దాడి చేశాడు. భర్త దాడితో ఆ మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. తలుపు తట్టారు. అయితే ఎవరూ తలుపు తీయలేదు. దీంతో ఇరుగు పొరుగు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. గాయపడిన గర్భవతిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఆమెను పీఎంసీహెచ్‌కు తరలించారు. అక్కడ మహిళకు 70 కుట్లు వేశారు. ప్రస్తుతం గర్భిణీ స్త్రీకి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మహిళ భర్త గర్భవతి అయిన తన భార్యపై దాడి చేసినప్పుడు ఆమె అత్తమామలు, అత్తమామలు కూడా అక్కడే ఉన్నారని గ్రామస్థులు తెలిపారు. ఒక్కరు కూడా ఆ మహిళకు సహాయం చేయలేదని చెప్పారు. గ్రామస్తులు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి రావడంతో భార్యపై దాడి చేసిన భర్త అక్కడి నుంచి పారిపోయారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన భర్తను అరెస్ట్ చేశారు. భార్యపై ఎందుకు దాడి చేశావని ప్రశ్నించిన పోలీసులతో తన భార్య తనను చాలా ఇబ్బంది పెట్టిందని.. ఎక్కడికీ బయటకు వెళ్ళనివ్వదని.. పైగా తన భార్య ఎక్కడికి వెళ్ళినా తనతో చెప్పాడని అన్నాడు. తన భార్య ప్రవర్తనతో విసిగి పోయి నట్లు చెప్పాడు.
సమాచారం ప్రకారం బాధితురాలు ప్రీతి బర్కా రాజ్‌పూర్ నివాసి. ప్రీతికి పాండే పట్టి నివాసి రవి చౌదరితో గతేడాది వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ప్రీతి భర్త రవి చౌదరి, అత్తమామలుకట్నం కోసం తన సోదరిని వేధించేవారని సోదరి రేఖా దేవి తెలిపారు. ప్రీతి గర్భవతి. మె సిమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగర్‌పురా గ్రామంలోని తన మేనత్త ఇంటికి వచ్చింది, అయితే మంగళవారం ప్రీతి భర్త నాగర్‌పురాకు వచ్చి ప్రీతిని తిరిగి తమ ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ ప్రీతిపై దారుణంగా దాడి చేశాడు. ఇప్పుడు ప్రీతి ప్రాణాల కోసం యముడితో పోరాడుతోంది.
డాక్టర్ ఎస్‌సి మిశ్రా మాట్లాడుతూ గర్భిణీ శరీరంపై పదునైన ఆయుధాలతో దాడి చేసిన గుర్తులు చాలానే ఉన్నాయని.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అంతేకాదు ప్రీతి భర్త రవి కత్తి, స్క్రూడ్రైవర్ తదితరాలతో కొట్టి గాయపరిచాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలకు కూడా ఇప్పుడు ముప్పు పొంచి ఉంది. అసలు ఆ గర్భిణీ స్త్రీ బతుకుతుందో లేదో చెప్పలేమన్నారు.
ముఫాసిల్ పోలీస్ స్టేషన్ హెడ్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ నిందితుడైన ప్రీతి భర్తను అరెస్టు చేశామన్నారు. ప్రస్తుతం ప్రీతి అత్తింటి కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారని వారి కోసం సోదా చేస్తున్నట్లు చెప్పారు. నిందితుల వాంగ్మూలాలను బట్టి చూస్తే అతడు పిచ్చివాడిలా ఉన్నాడనిఅన్నారు. ఈ కేసులో తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..